
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో తిరువణ్ణామలైకి వెళ్ళవచ్చు.. రైలు ద్వారా అయితే కాన్ఫడీ జంక్షన్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి 94 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాలి. తిరుపతి నుంచి అయితే 193 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఇక ఆలయంలో చూడదగిన విశేషాల విషయానికి వస్తే..
సర్వదర్శనం : ఉచితంగానే ఉంటుంది.
శీఘ్ర దర్శనం: 50 రూపాయలు
ఆలయ విశిష్టత విషయానికి వస్తే.. ఈ ఆలయం 25 ఎకరాలలో 9 గోపురాలతో ఉంటుంది.
ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది. 217 అడుగుల రాజగోపురం కలదు. ఇది దేశంలోని అతిపెద్ద వాటిలో మూడవదిగా నిలిచింది.
1500 సంవత్సరంలోని ఈ గుడిని అబ్బురపరిచే శిల్పకలతో నిర్మించారు. ఈ గుడిలో శివుడు మహా అగ్ని లింగ రూపంలో కనిపిస్తారు.
అరుణాచలంలో అన్నదానంతో పాటు 50 రూపాయలకే రకరకాల ప్రసాదాలు లభిస్తాయి.
బిల్వ, అశ్వత్థ వృక్షాలు: సంతానం కోసం చెరుకు ఊయల ఆలయంలో ఉన్నది.
అంతేకాకుండా పెళ్లి కాని యువతి యువకులు ఇక్కడ ఉండే కాశీ నందిని దర్శించుకుంటారు.
గిరి ప్రదర్శన విషయానికి వస్తే.. వేకువజామున, రాత్రి సమయాలలో చేయడం మంచిది. అయితే పిల్లలకు పెద్దలకు వీల్ చైర్స్ సౌకర్యం కూడా కలదు, నడవలేని వారికి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.
పరమశివుడు కొండ రూపంలో కొలువయ్యారు. ఈ కొండ ఎత్తు 814 మీటర్లు 2669 అడుగుల ఎత్తున కలదు. అయితే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 నిమిషాల వరకు మాత్రమే కొండ ఎక్కేందుకు అనుమతి.
కార్తీకదీపోత్సవం ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
అరుణాచలంలో ఎన్నో వసతులు కూడా కలవు. ముఖ్యంగా ఆంధ్ర ఆశ్రమం విషయానికి వస్తే.. ఇది శివసన్నిధి హోమ్ స్టే వద్ద కలదు. ఇక్కడ 22 గదులు కలవు . ఒక్కో గదిలో 6 మంది ఉండవచ్చు. అయితే బుకింగ్ కోసం నెల ముందు బుక్ చేసుకోవాలి.