నోట్ల రద్దు.. దేశంలోనే అతి పెద్ద సంస్కరణ.. దేశాన్ని కుదిపేసిన సంఘటన. ఒక్క కేంద్రం నిర్ణయంతో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు చిత్తు కాగితాల్లా మారిపోయింది. వాటి స్థానంలో కొత్త నోట్లు ముద్రించారు. మరి ఇంతకూ ఆ పాత నోట్లు ఏం చేశారు.. వాటి పరిస్థితి ఏంటి.. ఒకప్పుడు దర్జాగా చెలామణీ అయిన పాత కరెన్సీ ఏమైంది.. 

Image result for OLD NOTES
దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇటీవల ఆర్బీఐ విడుదల చేసింది. దాని ప్రకారం.. పెద్దనోట్ల రద్దులో భాగంగా వెనక్కితీసుకున్న 1000, 500 రూపాయల పాత నోట్లను లెక్కించి, అవి అసలైనవేనని నిర్ధారించుకున్నాక వాటిని చించేశారట. మరి అంత భారీ స్థాయిలో ఉన్న నోట్ల కట్టల ముక్కలను ఏం చేశారు.. అంటే.. వాటిని.. ఆ ముక్కలను కట్టలుగా కట్టి ఉంచారట. 

Image result for OLD NOTES
ఈ నోట్లముక్కల కట్టల ముక్కలన్నింటినీ ఇప్పుడు వేలం వేస్తారట. దీని కోసం టెండర్ ప్రక్రియ ద్వారా అమ్మేస్తారట. గత ఏడాది జూన్  నాటికి అందిన నోట్ల విలువ 15 లక్షల 28కోట్ల రూపాయలుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు అంచనా వేసింది. జమ అయిన పెద్దనోట్లను అధునాతన కరెన్సీ వెరిఫికేషన్ చేశారట. ఆ తర్వాత లెక్కించి, పరిశీలించిన అనంతరం...ప్రత్యేక వ్యవస్థ ద్వారా చించిశారట.



మరింత సమాచారం తెలుసుకోండి: