నీతులు చెప్పడంలో ఆయన చానల్  ఘనాపాఠి. పాటించడంలో మాత్రం అబ్బే ఆమడ దూరం. కులం పేరు చెప్పకూడదని, కుల రహిత సమాజం కోసం పోరాడుదామని చెప్పే రవి ప్రకాష్ తాను సీఈవోగా ఉంటూ నడిపించిన టీవీ 9 ఓ సామాజికవర్గానికే ఏకపక్షంగా వత్తాసు పలికిన సంగతి తెలిసిందే. అలాగే,  కట్నం అడిగిన వాడు గాడిద, అవినీతి  రహిత సమాజం కావాలి, రావాలి, ఇలా చాలా  గొప్ప నినాదాలే చేశారు. మరి జనాలూ కూడా నమ్మి ఆదరించారు.


సరే ఇపుడు ఇవన్నీ ఎందుకంటే రవి ప్రకాష్ మీద ఫోర్జరీ కేసు నమోదు అయింది. అదే విధంగా ఆయన్ని సీఈవో పదవి నుంచి కూడా తప్పించారని సమాచారం. నీతులు చెప్పే వారు తామే గోతిలో పడతారని చెప్పేందుకు ఒదో ఉదాహరణ. ఆ మధ్యన గరుడ పురాణం పేరు చెప్పి తన కులం వాడైన శొంఠినేని శివాజీ చేత ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం నిర్ఘాంతంపోయే నిజాలు చెప్పించారు.దాన్ని రాజకీయాలకు వాడుకున్నారు. 


తాము అన్నదే వేదమని, తాం పాడిందే పద్యమని చెప్పుకున్నారు. దీన్నే వైసీపీ అధినేత జగన్ సైతం తప్పుపట్టేవారు. ఎల్లో చానళ్ళ జాబితాలో టీవీ 9ని ఆయన చేర్చడానికి ఆ చానల్ ఏపపక్ష  విధానాలే ఓ కారణమని వైసీపీ నేతలు అంటారు. ఇపుడు అదే చానల్లో గొడవలు, ఆర్ధిక లావాదేవీల మీద రగడలు జరుగుతున్నాయి. మరి సమాజాన్ని నీతులు చెప్పి మేల్కొలిపే చానళ్ళు, వాటి పెద్దలు తమ దాకా వచ్చేసరికి ఇలాగే తప్పుకుంటారా అన్నదే జనం అడుతున్న ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: