పూర్వం నుంచి మన హిందూ సంప్రదాయంలో జాతకరీత్యా కొన్ని రత్నాలను ధరించడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది.ఆ రత్నాలను ధరించడం వల్ల వారి పనిలో పురోగతి చెంది,ఆర్థికంగానూ మరియు సామాజికంగానూ మంచి పేరుప్రతిష్టలు పొందుతారని వేదపండితులు కూడా చెబుతున్నారు.కానీ చాలామంది అవగాహన లోపంతో ఎలాంటి రత్నాలు ఎవరెవరు ధరిస్తే మంచిది అవుతుందో తెలియక సతమతమవుతూ ఉంటారు.కొన్ని రాశుల వారు ప్రత్యేకంగా కొన్ని రకాల రత్నాలని ధరించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అసలు ఎలాంటి రత్నాలను ఎవరెవరు దరించాలో మనము తెలుసుకుందాం పదండి..

పచ్చరత్నం..

ఈ రత్నం బుధగ్రహాన్ని సూచిస్తుంది.దీనిని ధరించడంతో అ వ్యక్తి తన జీవితంలో విజయాన్ని తొందరగా చేరుకోగలరు.మరియు అ వ్యక్తి మిగతా వారికన్నా తెలివైనవారిగా మారతారు.వారి నిర్ణయాలలో స్పష్టత ఉంటుంది.వారి ఇమేజినేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే పచ్చ రత్నాన్ని ధరించిన వ్యక్తి జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కచ్చితంగా స్పష్టంగా ఆలోచించి పరిష్కారాలను కనుగొంటారు.ఈ రత్నలను కుంభం,మీనం, ధనుస్సు రాశి వారు ధరించడం ఉత్తమం.

ఒపల్ రత్నం..

ఒపల్ రత్నం అంటే అన్ని రంగురాళ్లు కలిపి ఒక ఉంగరంలో ముద్రించి ఉంటారు.ఇలాంటి ఉంగరానికి కన్య రాశి వారు,వృషభ రాశి వారు ధరించడం చాలా ఉత్తమం.ఈ రత్నాన్ని ధరించిన వారికి వైవాహిక జీవితం కూడా చాలా అందంగా ఉంటుంది.మరియు సినిమాకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది.

నీలం..

నీలం మేష రాశి,సింహ రాశి,తులా రాశి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ రత్నాన్ని ధరించిన వారు నిర్మొహమాటంగా మాట్లాడటం,సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి గుణాలను పెంపొందించుకుంటారు. అంతేకాక వీరు సామాజికంగా చాలా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.

మణి రత్నం..

ఎవరైతే వారి రాశి లో బృహస్పతి బలహీనంగా ఉంటాడో,వారు ఈ రత్నాన్ని ధరించడం వల్ల బలపడతాడు.అంతేకాకుండా వ్యక్తి మానసిక క్షోభ, విశ్వాసం కోల్పోయిన భావనతో ఉంటే,ఆ వ్యక్తి ఈ మణి రత్నాన్ని ధరించడం ఉత్తమం.దానితో వారి జీవితంలో ఆనందాన్ని నింపుకోవచ్చు.

పుష్యరాగం..

ఈ రత్నం వృచ్చికం,ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరమైన రత్నం.అంతేకాక వ్యాపారంలో వుంటారో,వారు ఈ రత్నం ధరించడం వల్ల,అ వ్యక్తికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.దీన్ని ధరించిన వ్యక్తి పనిలో మునిగిపోతారు.అంతేకాకుండా,శని దోష ప్రభావం నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: