మన దేశంలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. షుగర్ మందులు వాడటం ద్వారా మాత్రమే మధుమేహంను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా మధుమేహం వ్యాధి దూరమవుతుందట.

వినడానికి వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా  తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న  తిరువేంని ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా  మధుమేహం నయమైపోతుందట.  ఈ ఆలయంలో శివుడు లింగరూపంలో ఉంటారు.  ఇక్కడ శివుడు  వెన్ని కరంబేశ్వరార్ గా  పార్వతి దేవి  సుందరి నాయకిగా పూజలందుకుంటున్నారు.  ఈ ఆలయం స్వయంభూ  ఆలయం కావడం గమనార్హం.

ఇక్కడ చేతిలో  చెరుకు ముక్కను పట్టుకుని ఉన్న  శివుడి ప్రతిమ  ఆలయంపై దర్శనం ఇవ్వనుంది.  మన దేశ నలుమూలల నుండి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.  ఈ ఆలయానికి వచ్చిన భక్తులు  చక్కర, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని  నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది.  ఈ ప్రసాదంలో కొంత భాగాన్ని  చీమలకు సమర్పిస్తారు.  చీమలు ఈ ప్రసాదం తింటే మాత్రం తమ వ్యాధి తగ్గుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఈ ఆలయంలోని శివలింగం శివుడు ప్రతిష్టించిన శివలింగం కావడం గమనార్హం.  ఈ ఆలయాన్ని దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశాలు  అయితే ఉంటాయి.  ఈ ఆలయానికి ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తారని  భోగట్టా.  ఈ ఆలయానికి  సంబంధించిన వింతలు, విశేషాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: