ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఉంటుంది.  కానీ కొంతమందికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయితే ఆ కలను నిజంగానే నిజం చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది అంటున్నారు పెద్దలు . మరీ ముఖ్యంగా కొంతమంది వాస్తు శాస్త్రం పండితులు ఒక పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటిని కట్టుకోవచ్చు అని అంటున్నారు. తద్వారా వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరిపోతుంది అని చెప్తున్నారు . వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్న ఆ పని ఏంటి..? ఎలా చేయాలి..? ఎప్పుడు చేయాలి..? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


మరి ముఖ్యంగా ఎవరైతే అన్నవరం గుడికి వెళ్లి శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాం అని దేవుడికి మొక్కుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ దేవుడి దగ్గర ఇచ్చే అక్షంతలను తీసుకువచ్చి మన ఇంటిలో పూజించే దేవుడి పటం దగ్గర పెట్టి మొక్కుకుంటే కచ్చితంగా సంవత్సరంలోపు ఇల్లు కట్టుకునే విధంగా ఆ దేవుడు కరుణిస్తాడట.  ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ 100 లో 90% మంది చెప్తున్నారు . ఇలా చేసిన తర్వాతే తమకి  ఇల్లు కట్టుకునే అంత శక్తి ప్రసాదించాడు ఆ దేవుడు అని కూడా చాలా మంది చెప్తున్నారు .

 

అంతేకాదు సత్యనారాయణ స్వామికి ముడుపు కట్టుకొని దండం పెట్టుకొని సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా.. సొంత ఇల్లు కట్టుకున్నాక మీకు పూజ చేసి పదిమందికి భోజనాలు కడుపునిండా పడతాము అని మొక్కుకున్నా కూడా ఆ స్వామి తక్షణమే కరుణించి ఇల్లు కట్టుకునే విధంగా మార్గం చూపిస్తాడట . చాలామంది పండితులు ఇదేవిధంగా చెబుతున్నారు . ఎవరైతే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరిపోవచ్చు అంటున్నారు జనాలు.



నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొందరు పండితులు చెప్పిన అలాగే కొందరు వాస్తు శాస్త్ర ప్రముఖులు చెప్పిన విషయంగా అందించబడినది.  ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులు గుర్తుంచుకోవాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: