
వాళ్ళందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని చెబుతూ ఉంటారు. మరి ఒక బ్రహ్మచారికి పూజిస్తే మరొక బ్రహ్మచారికి పెళ్లి ఎలా అవుతుంది ..?? అనేది ఇప్పటికి మిలియన్ డాలర్ల ప్రశ్న గా మిగిలిపోయింది. హనుమంతుడు బ్రహ్మచారి అని హిందూ మతంలో ప్రసిద్ధి. కానీ కొన్ని పురాణాల ప్రకారం ఆయనకు సువర్చల అనే భార్య కూడా ఉంది అని చెప్తూ ఉంటారు . బ్రహ్మచారి అంటే అర్థం బ్రహ్మచారిగా లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటూ కఠిన బ్రహ్మచర్యం పాటించే వ్యక్తి .
హనుమంతుడిని ఈ విషయంలో అందరూ ఆదర్శంగా పరిగణించబడతారు అది చాలామందికి తెలిసిన విషయమే . అయితే హిందూమతంలో హనుమంతుడు బాల బ్రహ్మచారి అని పిలుస్తూ ఉంటారు అంటే చిన్నప్పటినుండి బ్రహ్మచార్య దీక్ష స్వీకరించిన వ్యక్తి అనమాట . కొన్ని కొన్ని పురాణాలలో హనుమంతుడికి సువర్చల అనే భార్య ఉంది అని.. ఆయన సువర్చల అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని చెబుతుంటారు . సువర్చల మరెవరో కాదు సూర్యుని కుమార్తె అని అందరికీ తెలిసిందే . అయితే హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండడం వల్ల ఆయనకు అసాధారణమైన బలం భక్తి ఆధ్యాత్మికతలకు కారణమని భావిస్తూ ఉంటారు . ఆ కారణంగానే బ్రహ్మచారి అయిన ఆంజనేయస్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఎటువంటి కష్టాలనుండి అయినా ఆయన గట్టెక్కిస్తాడు అనే నమ్మకం . కానీ పురాణాలలో మాత్రం ఆయనకు సువర్చలా అనే భార్య ఉంది. ఇది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. కొంతమంది పండితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పడేస్తూ ఉంటారు..!