భారత జట్టు ఎట్ట కేలకు విజయం సాధించింది. కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టును దూరం అవుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ముందుండి జట్టును  నడిపించారు. ఉన్నది తక్కువ అనుభవమే అయినప్పటికీ.. పట్టుదల తో ముందుకు సాగారు భారత ఆటగాళ్లు. ఎక్కడా వెనక్కి తగ్గని భారత ఆటగాళ్లు ఆశ్చర్య భరితమైన పోరాట పటిమతో చివరికి విజయం సాధించారు. పోరాడితే పోయేదేమీ లేదు అన్న విధంగా.. పట్టుదల తో శ్రమించి అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు. మొదటి టెస్టులో ఘోరం గా ఓటమి పాలు అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు టీమిండియా.




 రెండో  మ్యాచ్ లో  అద్భుతంగా పుంజుకొని ఘన విజయాన్ని సాధించింది. మూడవ మ్యాచ్ లో  ప్రత్యర్థి జట్టుకు విజయం వరించేలా ఉంది అని భావించిన టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఇక ఎంతో నిలకడగా ఆడటంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగవ మ్యాచ్ లో ఏం జరుగుతుందో  అని  భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కీలక ఆటగాళ్లు జట్టులో  లేకపోయినా భారీ లక్ష్యం కళ్లముందు కనిపిస్తున్న ఎక్కడా దొనకలేదు బెణకలేదు.



 మొన్నటివరకు జీరో అన్న ఆటగాళ్లే ప్రస్తుతం అద్భుతంగా రాణించి హీరోగా మారి టీమిండియాకు విజయం అందించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో  ఒకటైన ఆస్ట్రేలియాను సొంతగడ్డపై భారత జట్టు మట్టికరిపించింది. ఇక ఈ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది టీమిండియా. 1988 తర్వాత బ్రిస్బేన్ లోని గబ్బ స్టేడియంలో తొలిసారి కంగారు జట్టుకు ఓటమి రుచి చూపించింది టీమిండియా.  దీంతో వరుసగా బోర్డర్-గవాస్కర్ ట్రోపి  టీమిండియా దక్కించుకుంది. అయితే ఇన్నేళ్ల  క్రికెట్ చరిత్రలో బ్రిస్బేన్ లోని గబ్బ స్టేడియంలో టీమిండియా విజయం సాధించడం ఇదే మొదటిసారి చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: