క్రికెట్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న సమయంలో కొన్ని ఆసక్తికర ఘటనలు జరుగుతూ ఉంటాయ్. ఇలాంటి ఘటనలు ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి ఆసక్తికర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇది చూసి క్రికెట్ ప్రేక్షకులందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రనౌట్ లో జరగడం కామన్. కానీ కొన్ని కొన్ని సార్లు విచిత్రమైన రనౌట్ లు  జరుగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకో బోయేది విచిత్రమైన రన్నవుట్ కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఇక్కడ రనౌట్ జరిగింది. ఇక ఈ వీడియో చూసిన వారందరినీ కూడా షాక్ అయ్యేలా చేస్తుంది.   దాదాపు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ ఈ రనౌట్ నిలిచిపోతుంది అని చెప్పాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఈ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎన్నో దేశాల ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. లీగ్లో భాగంగా దాకా ప్లాటున్, కూల్నా టైగర్ మధ్య మ్యాచ్ జరిగింది ఇక దాకా ప్లాటున్ జట్టులో ఆడుతున్నారు రస్సెల్, మహ్మదుల్లా. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం కూడా ఏర్పడింది. అయితే ఇన్నింగ్స్ 15 ఓవర్లలో ఐదో బంతిని రాసేల్ సిక్స్ కొట్టాడు. ఇక ఆ తర్వాత సింగిల్ తో స్ట్రైక్ తనవైపే ఉంచుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే  థర్డ్ మాన్ దిశగా ఆరో బంతిని ఆడాడు రసేల్. అయితే ఇంతలో ప్రత్యర్థి ఫీల్డర్ బంతిని అందుకుని వికెట్ల వైపు వేశాడు. ఇక ఇప్పటికే బంతి వికెట్లను తాకినప్పటికీ  మహ్మదుల్లా క్రీసులోనే చేరుకున్నాడు. ఇక అవతలి వైపు కూడా రస్సెల్ భయం లేదు అనుకుని కాస్త స్లో అయిపోయాడు. కానీ అతన్ని  దురదృష్టం వెంటాడి నట్లు తెలుస్తోంది.  స్ట్రైక్ ఎండ్  వద్ద వికెట్లను తాకిన బంతి మళ్లీ అక్కడి నుంచి వెళ్ళింది నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న వికెట్ల దగ్గరికి చేరుకుంది. రస్సెల్ చేరుకునేలోపే వికెట్లను గిరాటేసింది. దీంతో ఇలా ఊహించని విధంగా రస్సెల్ రన్ అవుట్ అయ్యి  ఎంతో నిరాశతో మైదానం వదిలి వెళ్లిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: