ఇటీవల దక్షిణాఫ్రికాలో పేలవ ప్రదర్శనతో ఓటమి చవిచూసిన టీమిండియా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.  ఇకపోతే టీమిండియా మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్ తో వరుసగా వన్డే టి20 సిరీస్ లకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి చేరుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో దక్షిణ ఆఫ్రికాలో పేలవమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వన్డే టి20 సిరీస్ ఆడుతున్న భారత జట్టును ఇటీవలే బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక ఎన్నో రోజుల నుంచి జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో స్థానం సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.


 చైనా మాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణయ్ పై కూడా బిసిసిఐ నమ్మకం ఉంచింది. అతనికి జట్టులో అవకాశం కల్పించింది. మొదటి సారి భారత జట్టులో ఆడబోతున్నాడు రవి బిష్ణయ్. హజారే ట్రోఫీ లో అదరగొట్టిన దీపక్ హుడా కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకోవడం గమనార్హం. ఇక రవిచంద్రన్ అశ్విన్కు మాత్రం వన్డే టి20 లలో అవకాశం దక్కకపోవడం గమనార్హం. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో ఊహించిన స్థాయిలో రాణించలేక పేలవా ప్రదర్శనతో నిరాశ పరిచిన కారణంగా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను పక్కనపెట్టేసింది బీసీసీఐ.



  ఇక ఇటీవలే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను జట్టు నుంచి తప్పించింది. మరోవైపు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ టి20 సిరీస్కు దూరమవ్వగా.. ఇషాన్ కిషన్ వన్డే జట్టుకు దూరమయ్యాడు. స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బూమ్రా షేమి లకు విశ్రాంతి ఇచ్చింది బిసిసీఐ. ఒకవైపు కేఎల్ రాహుల్  కూడా తొలి వన్డేలో ఆడటం లేదు అన్నది తెలుస్తుంది. ఇక రవీంద్ర జడేజా ఇంకా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో జట్టులోకి ఎంపిక చేయలేదు. వెస్టిండీస్తో భారత జట్టు ఆడబోయే వన్డే, టి20 సిరీస్ లో అనూహ్యమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి సిరీస్ ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది టి20 సిరీస్.

మరింత సమాచారం తెలుసుకోండి: