వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీం ఇండియా శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు వన్డే సిరీస్ను గెలుచుకోవడమే కాదు మరో వైపు ఏకంగా ఒక్క మ్యాచ్లో కూడా ఆతిథ్య వెస్టిండీస్ జట్టు గెలవకుండా పూర్తి ఆదిపత్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే 3-0 తేడాతో భారత జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది భారత జట్టు. అయితే ఇక ఇప్పుడు వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ లో భాగంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.


 అయితే టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో 58 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది రోహిత్ సేన. ఈ క్రమంలోనే ఇక రెండో మ్యాచ్లో కూడా టీమిండియాకు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఎంతో అలవోకగా విజయం సాధించి టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుందని భావించారు.. కానీ ఇప్పటివరకు వరుస ఓటములతో గెలుపు కోసం కసితో ఉన్న వెస్టిండీస్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే వర్షం కారణంగా రెండవ టీ 20 మ్యాచ్ కు అంతరాయం ఏర్పడినప్పటికీ 20 ఓవర్ల మ్యాచ్ జరిగింది. అయితే వెస్టిండీస్ బౌలర్ల విధ్వంసానికి భారత్ కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయ్యింది.


 అయితే 138 పరుగుల టార్గెట్ ను కాపాడుకోవడానికి భారత బౌలింగ్ విభాగం ఎన్నో ప్రయత్నాలు చేసింది. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ ఇలా అందరూ బౌలర్లు కూడా  కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడానికి  ఎంతగానో ప్రయత్నించారు. ఫీల్డింగ్  విభాగంలో కూడా ఎలాంటి తప్పులు జరగలేదనే చెప్పాలి. ఇలా విజయం కోసం చివరి వరకు పోరాడింది టీమిండియా.. కానీ చివర్లో అటు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడటంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: