బాబర్ అజాం : పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్ లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. కానీ ఇటీవల జరుగుతున్న వరల్డ్ కప్ లో మాత్రం ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. తక్కువ పరుగులకు వికెట్ చేజార్చుకొని పాకిస్థాన్ ను కష్టాల్లోకి నెట్టి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
డేవిడ్ వార్నర్ : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ గా విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ గా డేవిడ్ వార్నర్ కు పేరు ఉంది. ఇక ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందిస్తాడు అనుకుంటే డేవిడ్ వార్నర్ పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నారు. ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్లలో ఐదు, 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
కేఎల్ రాహుల్ : టి20 ఫార్మాట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్ లలో కేఎల్ రాహుల్ కూడా ఒకడు. కానీ వరల్డ్ కప్ లో మాత్రం తన బ్యాటింగ్ వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు టీం ఇండియా ఆడిన మూడు మ్యాచ్లలో కూడా 9, 4, 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
భావుమా :: సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా భారీగా పరుగులు చేస్తూ జట్టుకు ముందుకు నడిపించాల్సిన తెంప భావుమా పరుగులు చేయడానికి మాత్రం ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఆడిన రెండు మ్యాచ్లో కూడా రెండు, పది పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
ఇలా కీలక ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఆయా జట్ల యాజమాన్యాలు ఆందోళనలో మునిగిపోతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి