గత కొంతకాలం నుంచి జట్టులో కీలకమైన బ్యాట్స్మెన్ గా వికెట్ కీపర్ గా కొనసాగుతున్న రిషబ్ పంతుకు బీసీసీఐ వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. అతను వరుసగా పేలువమైన ప్రదర్శన చేస్తూ ఉన్నప్పటికీ తుది జట్టులో మాత్రం అతనికి స్థానం కల్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా ఎప్పటిలాగానే రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు.


 అయితే రిషబ్ పంత్ ఆడటం లేదని టాస్ వేసిన సమయంలో అటు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ లేకపోవడంతో సంజు శాంసన్ కు చోటు దక్కుతుందని అనుకున్నప్పటికీ.. అది జరగలేదు ఇక రిషబ్ పంత్ స్థానంలో కీపింగ్ కేఎల్ రాహుల్తో చేయించారు. కేఎల్ రాహుల్ కు మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి కేఎల్ రాహుల్ ఆసక్తికర సమాధానం చెప్పాడు అని చెప్పాలి.  రిషబ్ పంత్ గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం అందలేదు అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.


 నాక్కూడా రిషబ్ పంత్ ఆడటం లేదు అన్న విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్ లోనే తెలిసింది. అతన్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అయితే కారణాలు ఏంటి అన్నది మాత్రం నాకు తెలియదు.  ఈ ప్రశ్నలన్నింటికీ మెడికల్ టీం అయితే సరైన సమాధానం చెప్పగలుగుతుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు.  ఇక నాకు అప్పుడే అతని రిలీజ్ చేసినట్లు తెలిసింది. ఇక మేము మ్యాచ్ పై ఫోకస్ పెట్టాలి. కాబట్టి ఇక ఆ విషయం గురించి ఎక్కువగా ప్రశ్నించలేదు అంటూ కె.ఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక కేఎల్ రాహుల్ చెప్పిన సమాధానం కాస్త కొత్త చర్చకు దారి తీసింది. అదేంటి మిగతా ఆటగాళ్లకు తెలియకుండా రిషబ్ పంతును తప్పించారా అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: