ఏడాది టి20 ఫార్మట్ లో టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీం ఇండియా విదేశీ పర్యటనకు వెళ్లిన లేకపోతే విదేశీ జట్టు టీమ్ ఇండియా పర్యటనకు వచ్చిన అదే రీతిలో ఆదిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగినా లేకపోతే సీనియర్ ప్లేయర్లతో పటిష్టంగా ఉన్న అటు ప్రత్యర్ధులను  చిత్తు చేస్తూ వరుసగా సిరీస్లలో విజయం సాధించింది టీమిండియా జట్టు.


 ముఖ్యంగా టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకునే ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ఆట తీరుతో అదరగొట్టారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా ఈ ఏడాది మొత్తం ఆడిన టి20 సిరీస్ లలో అదిరిపోయే ప్రదర్శన చేసిన టీమిండియా.. ఇక వచ్చే ఏడాదిలో కూడా మొదటి వారంలోనే మరో టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత  పర్యటనకు రాబోతున్న శ్రీలంకతో టి20 సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్, జట్టు వివరాలను కూడా బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఏడాది టీ20 టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ టి20 లో హైయెస్ట్ స్కోర్ అయిన 260/5 ను బ్రేక్ చేయలేకపోయింది.



 2017లో శ్రీలంకతో జరిగిన టి20 లో టీమిండియా ఈ రికార్డును నెలకొల్పింది అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఇక వచ్చే ఏడాది అదే శ్రీలంకతో టీమిండియా స్వదేశంలో టీ20 సిరీస్ ఆడుతున్న నేపథంలో ఈ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని ప్రస్తుతం ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా జనవరి మూడవ తేదీ నుంచి శ్రీలంక, ఇండియా మధ్య మూడు మ్యాచ్ల టి20 సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే  ఇక ఈ సిరీస్ కు అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు అందుకోగా కీలక బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: