ఏ మ్యాచ్ అయినా పరుగుల వర్షం కురిపించే టీమిండియా న్యూ సెన్సేషనల్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్‌ గిల్‌ జనవరి నెలకు గానూ పురుషుల విభాగంలో ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నిలిచాడు.జనవరి నెలలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శుబ్ మన్ గిల్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. శ్రీలంక ఇంకా న్యూజిలాండ్ సిరీస్‌లలో అయితే ఏకంగా సెంచరీల మీద సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల వయసున్న గిల్‌ జనవరి నెలలో ఏకంగా మూడు సెంచరీలు కొట్టేశాడు. అంత మాత్రమే కాదు ఈ కాలంలో ఏకంగా 567 పరుగులని గిల్ సునాయసంగా బాదేశాడు. ఇక హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అయితే తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు.అతను కేవలం 149 బంతుల్లో ఏకంగా 28 బౌండరీల సహాయంతో 208 పరుగులు చేశాడు. అందువల్ల వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా గిల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.


కాగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం శుబ్మన్ గిల్‌.. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంకా కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే నుంచి పోటీని ఎదుర్కొన్నాడు. అయితే ఐసీసీ మాత్రం గిల్ వైపే మొగ్గు చూపించింది.ఇంకా అలాగే మరోవైపు జనవరి నెలకు మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్ యంగ్‌ క్రికెటర్‌ గ్రేస్ స్క్రీవెన్స్ కు లభించింది. ఈ సంవత్సరం జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆమె భారీగా పరుగులు చేసింది. ఇప్పుడు ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్‌గా గా స్క్రీవెన్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కాగా అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో గిల్‌ ఒక రేంజిలో చెలరేగాడు. అతను కేవలం 63 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అందువల్ల సచిన్‌ టెండూల్కర్, రోహిత్, సురేశ్ రైనా ఇంకా అలాగే విరాట్ కోహ్లితో తర్వాత మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో టీమండియా క్రికెటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: