
అతని స్థానంలో శుభమన్ గిల్ వచ్చాడు. అతను అయినా మంచి ప్రదర్శన చేస్తాడు అనుకుంటే అతను కూడా నిరాశ పరుస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇక మళ్ళీ కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే బాగుంటుంది అనే వాదన కూడా తిరమీదికి వచ్చింది. అయితే ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఆటగాడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటం సహజం. కెరియర్లో ఇది ఒక దశ మాత్రమే. అలా ఎలా ఫామ్ కోల్పోతారు ఎప్పుడు ఫామ్ లోనే ఉండాలని బయట నుంచి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే కెరీర్ మొదటి నుంచి చివరి వరకు ఫామ్ కోల్పోకుండా ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఇలాంటి విషయాలు చాలా మంచి చేస్తాయి. అయితే ఇలాంటివి అడిగితే విమర్శకులు కాస్త బాధపడతారేమో. అలాగే విమర్శకులు అనే మాటలు కూడా ఆటగాళ్లను బాధపెడతాయని తెలుసుకోవాలి.. ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్ కి వ్యవహరిస్తూ నాలుగైదు సెంచరీలు బాదిన ఒక బ్యాట్స్మెన్ అంతర్జాతీయ మ్యాచ్కు వచ్చేసరికి తుదిజట్టులో లేకుండా డ్రింక్స్ తీసుకు వెళ్లాల్సి వస్తే అతనికి ఎంతో బాధ కలుగుతుంది. అందుకే కేఎల్ రాహుల్ ఐపీఎల్ ను టోర్నమెంట్ గానే కాకుండా ఫామ్ అందిపుచ్చుకోవడానికి ఉపయోగించుకోవాలి అంటూ సూచించాడు గౌతమ్ గంభీర్.