2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి హడావిడి మొదలైంది. ఇక ఐపీఎల్ టోర్నీ కోసం అన్ని ఫ్రాంచైజీలు కూడా సిద్ధమవుతున్నాయి. టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ట్రేడింగ్ ద్వారా ఇతర టీమ్స్ లోనే ఆటగాళ్ళను సంప్రదింపుల ద్వారా తమ టీం లో చేర్చుకున్నాయి అన్న విషయం తెలిసిందే  అయితే నేడు అందరూ ఎదురు చూసిన మినీ వేలం ప్రక్రియ జరుగుతుంది. దుబాయ్ వేదికగా ఈ మినీ ఆక్షన్ జరుగుతూ ఉండడం గమనార్హం.


అయితే మొన్నటికి మొన్న ఇండియా వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అదరగొట్టిన ఎంతో మంది ఆటగాళ్ళు ఇక ఇప్పుడు ఐపీఎల్ వేలంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్లకు భారీ ధర పలికే అవకాశం ఉంది అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్గా కొనసాగుతున్న పాట్ కమిన్స్ కు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టూ 20.50 కోట్లు పెట్టి రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ వరల్డ్ కప్ లో సెన్సేషన్ ప్లేయర్ గా మారిపోయాడు న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర. మొదటి వరల్డ్ కప్ లోనే బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు.


 ఇక అతను కూడా వేలంలో పాల్గొనగా.. అతన్ని ఏ టీం సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో సెన్సేషన్ బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. ఏకంగా 50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఈ యువ ఆటగాడిని చెన్నై జట్టు 1.80 కోట్లకి కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో ఆల్రౌండర్ గా అదరగొట్టిన ఈ యువ ఆటగాడు.. ఇక ధోని కెప్టెన్సీలో మరింత రాటు తేలి అత్యుత్తమ ప్రదర్శన చేసే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl