ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ టీమ్స్ ఏవి అంటే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల పేరును చెబుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా అత్యధికంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాదు మిగతా జట్లతో పోల్చి చూస్తే ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించాయి అన్న విషయం తెలిసిందే. ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటాయి. అయితే ముంబై ఇండియన్స్ జట్టు అయితే ఐపీఎల్ గెలవడమే కాదు అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా మొదటి ప్రయత్నంలోనే టైటిల్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.


 అయితే ఇలా ఛాంపియన్ టీమ్స్ గా కొనసాగుతున్న జట్లకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం సర్వసాధారణం. ఇక ప్రస్తుతం ఫాలోవర్ల విషయంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అటు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక పోయినప్పటికీ.. ఈ రెండు టీమ్స్ కి గట్టి పోటీ ఇస్తూ వస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే 17 ఏళ్ల నుంచి ఐపీఎల్ లో టైటిల్ కలను సహకారం చేసుకోలేకపోయింది బెంగళూరు టీం. కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం ఇటీవల టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే.


 దీంతో బెంగుళూరు ఒక్కసారైనా టైటిల్ గెలుస్తుందేమో అని నిరీక్షణగా ఎదురు చూసిన అభిమానులకోరిక తీరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఒక్కసారి టైటిల్ గెలిచిన ఆర్సిబి ఏకంగా ఫాలోవర్ల విషయంలో ముంబై ఇండియన్స్ ని వెనక్కి నెట్టేసింది. దీంతో ఫాలోవర్ల విషయంలో రెండో స్థానంలో కొనసాగిన ముంబై ఇండియన్స్ ఇక ఇప్పుడు మూడో స్థానంలోకి పడిపోయింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఉన్న ఫాలోవర్లు 12.7 మిలియన్లు, ముంబై ఇండియన్స్ కి 12.6 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. ప్రథమ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ 14.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండడం గమనార్హం. అయితే ఒక టైటిల్ గెలిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే.. ఐపిఎల్ లో బెంగళూరు టైటిల్ గెలిచిందంటే చెన్నైని కూడా ఫాలోవర్ల విషయంలో ఆర్సిబి వెనక్కి నెట్టడం ఖాయమని  ఆ జట్టు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl