గౌతమ్ గంభీర్ ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ కు ప్రధాన కోచ్‌గా కానున్నాడు, ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) నుంచి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గంభీర్ చాలా నెలలుగా కోచ్ పదవి కోసం వేచి ఉన్నాడు, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఇప్పుడు జరుగుతున్న t20 ప్రపంచ కప్ తర్వాత ముగుస్తుంది.

దాంతో bcci గంభీర్‌ను సంప్రదించింది. అతను కొన్ని షరతుల ప్రకారం ఈ ఆఫర్‌ను అంగీకరించాడు. అతని ప్రాథమిక డిమాండ్లలో ఒకటి సపోర్టింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేయడంపై తానే నియంత్రణ కలిగి ఉండటం, దీనికి బీసీసీఐ అంగీకరించింది. "భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండటానికి మేము గంభీర్‌తో చర్చలు జరిపాము. అతను t20 ప్రపంచ కప్ తర్వాత అవుట్‌గోయింగ్ రాహుల్ ద్రవిడ్‌ను భర్తీ చేస్తాడు." అని బీసీసీఐచెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం, సపోర్టింగ్ స్టాఫ్‌లో బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు. గంభీర్ కోచ్‌ అయ్యాక ఈ స్థానాల్లో ఉన్నవారు ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే గంభీర్ తన సొంత జట్టును తీసుకురావాలనే కోరికను వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అతని విజయవంతమైన ప్రదర్శన ద్వారా గంభీర్ కోచింగ్ స్కిల్స్ బలపడ్డాయి, అతని వల్ల IPL 2024 టైటిల్‌కు KKRకి దారితీసింది. KKRలో అతని పనిని చాలామంది మెచ్చుకున్నారు. అత్యుత్తమ కోచింగ్ అభ్యర్థిగా అతని పేరు మార్మోగింది.

ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో, గంభీర్ ఈ పాత్ర పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, "నేను భారత జట్టుకు కోచ్‌గా ఉండటానికి ఇష్టపడతాను. మన జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండటం కంటే పెద్ద గౌరవం లేదు. మన 140 కోట్ల మంది భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నా. " అని అన్నారు.

42 ఏళ్ల గంభీర్ క్రికెట్ రెజ్యూమ్ ఆకట్టుకునేలా ఉంది.  అతను 2007లో t20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో, 2011 ODI ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు. అతని అనుభవం, నాయకత్వ లక్షణాలు భారత క్రికెట్ జట్టుకు సరికొత్త దృక్పథాన్ని తీసుకువస్తాయని భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం క్రికెట్ కమ్యూనిటీ ఎదురుచూస్తుండగా, జాతీయ జట్టుపై గంభీర్ ప్రభావం గురించి అంచనాలు, ఉత్సాహం ఉన్నాయి. భారత క్రికెట్ కోచింగ్‌లో కొత్త అధ్యాయానికి గుర్తుగా బీసీసీఐ ఈ నెలాఖరులో ప్రకటన చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: