
ఆర్‌సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించడం గమనార్హం. కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనానికి కారణం అయ్యాడు. 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్‌ను కెప్టెన్ పాటీదార్ వదిలేయడంతో ఆర్‌సీబీ భారీగా నష్టపోయింది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 163 పరుగులు సాధించింది. ఫిల్ సాల్ట్ (37; 17 బంతుల్లో 4×4, 3×6), టిమ్ డేవిడ్ (37; 20 బంతుల్లో 2×4, 4×6) మెరుపులు మెరిపించారు. ఇకపోతే ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలి జట్టుగా బెంగళూరు రికార్డుల్లోకెక్కింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఇప్పటివరకు 45 మ్యాచుల్లో ఓడిపోవడం దురదృష్టకరం.
అయితే, అంతకు మునుపు ఈ చెత్త రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ ఏకంగా 44 మ్యాచ్‌ల్లో ఓడింది. కాగా డీసీ రికార్డు ఇప్పుడు బెంగళూరు బ్రేక్ చేసినట్టు అయింది. తద్వారా ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు పొందిన తొలి జట్టుగా బెంగళూరు చెత్త రికార్డును నమోదు చేసినట్టు అయింది. ఇక ఈ లిస్టులో ఈ జాబితాలో కేకేఆర్ మూడవ స్థానంలో ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో 38 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఘనత డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ కి చెందుతుంది. అంతకుముందు ఢిల్లీలో డీసీ 44 మ్యాచుల్లో ఓడింది. ఇప్పుడు 45 ఓటములతో డీసీని అధిగమించి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఆర్‌సీబీ. దాంతో సొంత మైదానంలోనే ఇలా పరాజయాలు ఎదురవడంపై అభిమానులు మండిపడుతున్నారు.