ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లీ సేన, అభిమానుల కలను నిజం చేసింది. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో RCB పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన RCB, 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ కీలకంగా 65 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. పంజాబ్ కింగ్స్ 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ, నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమయ్యింది. దీంతో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 2025 ట్రోఫీని అందుకుంది.

ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన RCBకి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రెండో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుకు రూ. 12.5 కోట్లు లభించాయి. ప్రైజ్ మనీలో ఈసారి బీసీసీఐ పెద్ద ఎత్తున పెంపు చేసింది. ముంబై ఇండియన్స్ (క్వాలిఫయర్ 2లో ఓడిన జట్టు): రూ. 7 కోట్లు, గుజరాత్ టైటాన్స్ (ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు): రూ. 6.5 కోట్లు, ఇక వ్యక్తిగత అవార్డులు,  ఆటగాళ్లకు నగదు బహుమతులు విషయానికి వస్తే..

ఆరెంజ్ క్యాప్ విజేత – సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) - రూ. 10 లక్షల ప్రైజ్ మనీ, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేశారు.

పర్పుల్ క్యాప్ విజేత – ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) - రూ. 10 లక్షల ప్రైజ్ మనీ, 15 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశారు.

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – సాయి సుదర్శన్ - రూ. 10 లక్షల ప్రైజ్ మనీ, యువ ప్రతిభను చాటుకున్నాడు.

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని తెచ్చే టీ20 లీగ్‌గా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించే ఈ లీగ్‌లో, 2025 సీజన్ RCB అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలవనుంది. ఈ విజయంతో కోహ్లీ కెరీర్‌లో మరో గొప్ప మైలురాయి చేరుకుంది. జట్టు ప్రదర్శనతో పాటు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభకు గుర్తింపు దక్కడంతో ఐపీఎల్ 2025 సీజన్ ఘనవిజయం సాధించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: