తెలుగు ప్రేక్షకులకు వైవాహర్ష అంటే ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ముఖ్యంగా యూట్యూబర్గా ఎన్నో వీడియోలను చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ఆ తర్వాత పలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కలర్ ఫోటో సినిమా తర్వాత కమెడియన్ గా కూడా పలు సినిమాలలో నటించారు. ఇలా వరుసగా సినిమాలలో కమెడియన్గా నటిస్తున్న సమయంలో అని వైవాహర్ష ఇటీవలే హీరోగా కూడా సుందరం మాస్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాగా కాస్త డిఫరెంట్ గా ఉన్నది.

హీరో రవితేజ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కించారు వైవా హర్షకు జోడిగా దివ్య శ్రీపాద నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం తోపాటు వైవా హర్ష కూడా పాల్గొన్నారు. తన పడిన కష్టాల గురించి అవమానాల గురించి  ఎన్నో విషయాలను తెలియజేశారు.. తాను చిన్న వయసు నుంచి ఆస్తమా అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నానని తెలియజేశారు. ఈ సమస్య వల్ల తను స్టైరాయిడ్ కూడా తీసుకోవడం వల్ల చాలా అధిక బరువు పెరిగిపోయాను అంటూ తెలియజేశారు.


దీనివల్ల చిన్న వయసులో బరువు పెరిగి స్కూలుకు వెళ్లినప్పటికీ అక్కడ కూడా తనని స్నేహితులు చాలామంది దారుణమైన కామెంట్లు చేసేవారని.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తన బాడీ మీద కలర్ మీద కూడా చాలామంది హేళన చేసి మాట్లాడే వారిని తెలిపారు కలర్ ఫోటో సినిమా ముందు వరకు తాను ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానని ఎన్నోసార్లు బాధపడ్డాను.. కానీ కలర్ ఫోటో సినిమా తర్వాత తనని తాను చూసుకొని చాలా గర్వపడ్డానని తెలిపారు.కొన్ని సినిమాలలోని పాత్రలు కేవలం డబ్బుల కోసం మాత్రమే నటించానని.. తనకు ఇష్టం లేకపోయినా Emi కట్టాల్సి ఉంటుంది కనుక పలు పాత్రలలో నటించాల్సి వచ్చిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: