బుల్లితెర పైన తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో కూడా అందం అభినయంతో కలిగి ఉన్న హీరోయిన్లలో శాండ్రా జై చంద్రన్ ఒకరు. ఇప్పటివరకు సుమారుగా 10 సీరియల్స్ పైగా నటించిన ఈమె కలవారి కోడలు అనే సీరియల్ ద్వారా బుల్లితెర పైన మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం ఆటో విజయశాంతి అనే సీరియల్ నటిస్తూ ఉన్నది. ఈ అమ్మడు అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. తన ప్రియుడి ఫోటోని షేర్ చేస్తూ.. తమ గురించి అందరికీ చెప్పేస్తున్నాను అంటూ వెల్లడించింది.


నీకోసం వెతుక్కుండానే నువ్వు నాకు దొరికావు.. ఇలా దొరకడం నా అదృష్టం అంటూ క్యాప్షన్ గా రాసుకుంది
శాండ్రా జై చంద్రన్. ఈ పోస్ట్ చూసిన పలువురు అభిమానులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నారు.శాండ్రా జై చంద్రన్ చేసుకోబోయే వరుడు మరెవరో కాదు బుల్లితెర మహేష్ బాబు. ఇతను పూర్తి పేరు మహేష్ బాబు కాళిదాస్. ఈయన కూడా పలు సీరియల్స్లలో నటించారు. మనసిచ్చి చూడు, శుభస్య శ్రీఘం వంటి సీరియల్స్ లో మెయిన్ పాత్రలో నటించారు.


శాండ్రా జై చంద్రన్, మహేష్ బాబు ఇద్దరూ కూడా శుభస్య శ్రీఘం వంటి సీరియల్ లో నటిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. అందులో రెగ్యులర్ గా ఫోటోలను, వీడియోలు షేర్ చేస్తూ ఉండడంతో నెమ్మదిగా స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలియజేస్తున్నారు. గతంలో రూమర్స్ అంటూ వినిపించినప్పటికీ తాజాగా ఈ అమ్మడు వాటిని నిజం చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.
శాండ్రా జై చంద్రన్ 19 ఏళ్లకు వివాహం చేసుకోగా తనతో పాటుగా మరొక అమ్మాయితో రిలేషన్లు ఉండడంతో విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మళ్లీ చాలా ఏళ్లు డిప్రెషన్ లో ఉన్న ఈ  నటి ఒకానొక సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. వాటన్నిటిని ఎదుర్కొని ఇప్పుడు  వివాహ బంధం లోకి అడుగుపెట్టబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: