ఎవరైతే మొదటిసారి తమ ఆదాయపు పన్ను కట్టాలి అని అనుకుంటున్నారో.. దీనికోసం ముందుగా వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఇన్కమ్ టాక్స్ పోర్టల్  ఓపెన్ చేసి అందులో ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఈ దశ అత్యవసరం. ఇక అంతే కాదు మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం కోసం ముందుగా పాన్  నెంబర్ తో పాటు పాన్ నంబర్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ , ఇమెయిల్  అడ్రస్ వంటి వివరాలు వుండడం వల్ల మొదటిసారి ఎవరైతే ఇన్కమ్ టాక్స్ దాఖలు చేస్తున్నారో.. వారికి సులభతరం అవుతుంది. అంతేకాదు సులభమైన పద్ధతుల ద్వారా మీరు ఖాతా ను ఓపెన్ చేయవచ్చు..

ఎవరైతే కొత్త ఆదాయపు పన్ను పోర్టల్లో మీ ఖాతాను నమోదు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారు ఇప్పుడు ఇచ్చే కొన్ని సూచనలను పాటించండి..

www.incometax.gov.in ఈ వెబ్సైట్ ద్వారా ఆదాయపు పన్ను పోర్టల్  ఓపెన్ అవుతుంది.

ఇక హోం పేజీలో పైన కుడి వైపున రిజిస్టర్ అని ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి..

అక్కడ పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ధ్రువీకరణ కోసం పాన్ వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ ఫోన్ నెంబర్ లేకుండా మీరు ఎటువంటి ఖాతాను ఓపెన్ చేయలేరు.. దీనిని గుర్తుంచుకోవాలి.

ఇక రిజిస్ట్రేషన్లలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల గా గుర్తించాలి.. పాన్ ధ్రువీకరణ తరువాత కొనసాగించు అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.

మీ పేరు, పుట్టినతేదీ, ఊరు , లింగం వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత కొనసాగించు అనే ఆప్షన్  క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఫోన్ నెంబర్ కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి తో సహా అన్ని సంప్రదింపు వివరాలను నమోదు చేయాలి. పాన్ నెంబర్ ఎవరిది అయితే ఉంటుందో వారిదే మొబైల్ నెంబర్ , ఇమెయిల్ ఐడి అయి ఉండాలి.

ఇక మీ ఫైనల్ అడ్రస్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్ కు  వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది.. దాని కోసం మీరు కొనసాగించు అనే  ఆప్షన్ పై  క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ఎంటర్ చేసిన  అన్ని వివరాలను ఒకసారి రీ చెక్  చేయాల్సి ఉంటుంది. ఏదైనా లోపాలు ఉంటే సవరించి ఆ తర్వాత నిర్ధారించు పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఒక పాస్వర్డ్ వస్తుంది.. ఇప్పుడు పాస్వర్డ్ ను రెండవసారి నమోదు చేయాల్సి ఉంటుంది..

అంతే మీ ఖాతా ఓపెన్ అయినట్టే..



మరింత సమాచారం తెలుసుకోండి:

ITR