ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి...  ఇడ్లీలు చేయడానికే సుమారు గంట సమయం పడుతుంది. అలాంటిది విశాఖకు చెందిన ఈ పదేళ్ల చిన్నారి.. గంట వ్యవధిలోనే 33 రకాల వంటలు చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు ఇది వరల్డ్ రికార్డు అయ్యింది.
 
ఆటలాడుకొనే వయస్సులో.. ఆ చిన్నారి గరిటె పట్టింది. ఆడుతూ పాడుతూ చకచకా వంటలు చేసేస్తూ.. ఔరా అనిపిస్తోంది. అంత చిన్న వయస్సులోనే వంటలు చేయడం అంటే మాటలా? చాలా కష్టం కదూ. అందుకే.. ఆమె ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కేసింది. ఆ చిన్నారి మరెవ్వరో కాదు.. మన విశాఖపట్నానికి చెందిన శాన్వీ ప్రజీత్.శాన్వీ ఇడ్లీ, ఉతప్తం, మష్రూమ్ టిక్కా, పాపిడీ చాట్, వాఫెల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్, పాన్ కేక్స్, అప్పం వంటి 33 రకాల వంటలను కేవలం ఒక గంటలోనే తయారు చేసి ఔరా అనిపించింది. ఈ అరుదైన రికార్డును శ్వానీ తమ యూట్యూబ్ చానెల్ ‘Saanvi Cloud 9’లో పోస్టు చేసింది. ఈ చానెల్‌లో శాన్వీ మంచి వంటకాలతోనే కాదు డ్యాన్స్ వీడియోలతోనూ ఆకట్టుకుంటోంది.
కేరళలోని ఎర్నాకులంకు చెందిన ప్రజీత్ బాబు, ఆయన భార్య మాజ్మ ప్రజీత్‌లు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ప్రజీత్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్‌గా చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారానే శాన్వీ వంటలను వీక్షించారు. గంట వ్యవధిలోనే 33 వంటకాలను పూర్తిచేసిన శాన్వీ పేరును రికార్డుల్లో నమోదు చేశారు.ఈ విషయాన్ని శాన్వీ తల్లి ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. శాన్వీకి బాల్యం నుంచి వంటలు చేయడం సరదా అని, అందుకే ఈమె ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకోగలిగిందని మాజ్మ తెలిపారు. ఇంత చిన్న వయస్సులో శాన్వీ ఇంత ఘనత సాధించిందంటే నిజంగా గ్రేటే కదూ.


మరింత సమాచారం తెలుసుకోండి: