ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి. అవి ఎందుకు పనికి రావని అనుకుంటాం. కాని మనకే తెలీదు వాటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మనం తాగేసి పడేసిన వాటర్ బాటిల్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో తెలుసా? అవి ఏకంగా వెలుగునే నింపుతాయి. అర్ధం కాలేదా.. అయితే ఈ స్టోరీ తెలుసుకోండి...

పిలిప్పీన్స్‌ దీవిలో బ్రతుకుతున్న చాలామంది పేద వాళ్ళ  ఇళ్లకు విద్యుత్ సదుపాయం లేదు. ఇళ్లన్నీ ఒకదానికి  ఒకటి కలిసి ఉండటం వల్ల పగటి వేళల్లో కూడా ఇళ్లు చీకటిగానే ఉంటాయి. దీంతో వారు కొవ్వొత్తులు వెలిగించి కాలం వెళ్ల దీస్తున్నారు. దీనివల్ల అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘లీటర్ ఆఫ్ లైట్’ అనే స్వచ్చంద  సంస్థ.. ఉచితంగా వారి ఇళ్లలో వెలుగులు నింపేందుకు అందుకు కృషి చేసేందుకు సిద్ధమయ్యింది..ఒక లీటర్ బాటిల్‌లో నీళ్లు నింపి, అందులో కాస్త బ్లీచింగ్ వేస్తున్నారు. దీనివల్ల నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అనంతరం ఆ బాటిళ్లను రేకు ఇళ్ల పైకప్పులకు అమర్చుతున్నారు.

దీంతో బాటిళ్లలోని స్వచ్ఛమైన నీరు కాంతిని గ్రహించి ఇళ్లలో వెలుగులు నింపుతున్నాయి. దీనివల్ల పగటి వేళ్లలో చీకట్లు తొలగిపోతున్నాయి. ఆ బాటిళ్ల పై కప్పుల్లో ఉంచేందుకు వీలుగా రేకులను జత చేస్తున్నారు.సోలార్ కాంతితో పనిచేసే చిన్న ఎల్‌ఈడీ లైట్‌ను బ్లీచింగ్ నీళ్లతో నింపిన బాటిళ్లల్లో పెడుతున్నారు. చీకటి పడగానే ఆ లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. దీంతో కరెంటు అవసరం లేకుండా రాత్రి వేళ్లల్లో కూడా బాటిల్ ద్వారా చక్కటి  కాంతిని పొందుతున్నారు. చివరికి వీధి దీపాలను సైతం ఈ విధంగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్‌గా మారింది. దీనికి కారణమైన  ‘లీటర్ ఆఫ్ లైట్’ స్వచ్చంద సంస్థ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటివరకు 15 దేశాల్లో సుమారు 350,000 బాటిళ్లను ఇళ్లకు ఏర్పాటు చేసింది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ బాటిళ్ల ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, వీటి వల్ల అగ్నిప్రమాదాల సమస్య కూడా ఉండదని సంస్థ వెల్లడించింది.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: