కరోనా..కరోనా..కరోనా.. ఈ పేరు వినగానే ప్రజల వెన్నులో భయం పుడుతుంది. ఎక్కడికైనా వెళ్లి దాక్కోవాలి అనిపిస్తుంది.. అంతలా చైనాలో పుట్టి, ప్రపంచం నలుమూలలా వ్యాపించి, తన పంజా విసురుతోంది. కరోనా వ్యాపించి దాదాపు సంవత్సరం దాటినప్పటికీ దాని ప్రభావాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.. ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ఎన్నో కోవిడ్ నియంత్రణలు పాటించిన ప్పటికీ , కరోనా మహమ్మారి ఏదో ఒక రకంగా వ్యాపించి, ప్రజల ప్రాణాలను తీసుకెళ్ళిపోతోంది. కరోనా గురించి 1916 వ సంవత్సరంలోని ఒక ఇంగ్లీష్ వార్తా పత్రికలో ప్రచురించిన విషయం అందరికీ తెలిసిందే.
మొదట చిన్నగా మొదలై, ఆ తరువాత తన పంజా విసిరి చిన్న, పెద్ద,ముసలి,ముతక అనే తేడా లేకుండా ఎంతోమందిని తీసుకెళ్లి పోయింది. ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. కుక్కలు చించిన విస్తరిలా ఎంతోమంది బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. ఇప్పుడు అంతేకాకుండా కరోనా వైరస్ మొత్తం 76 రకాల కరోనా వైరస్ లు బయటపడ్డాయని వైద్య నిపుణులు ఒక అధ్యయనం ద్వారా తేల్చి చెప్పారు. ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ దీని ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.
ఇదిలా ఉండగా బ్రిటన్ లో మరో సరికొత్త రకం వైరస్ మొదలయ్యి,అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. కొత్తరకం కరోనా వైరస్ ఇతర స్ట్రెయిన్ లా వ్యాప్తి పై, పరిశోధకులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ లు కోవిడ్ - 19 కొత్త స్ట్రెయిన్ ల నుంచి రక్షణ కల్పిస్తాయని కొందరు చెబుతుండగా, మరి కొంతమందేమో వైరస్ వేగంగా కొత్తరూపు సంతరించుకున్న క్రమంలో వ్యాక్సిన్ ల సామర్థ్యంపై సందేహాలకు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త రకం వైరస్ మొదలవడంతో మాస్క్ ధరించడం వంటి నియంత్రణ చర్యలు పాటించడం కీలకంగా మారింది.
ఇక ఎలాంటి వైరస్ అయిన 95 శాతం వరకు నిర్వహించేలా, యాంటీవైరల్ కోటింగ్ మాస్క్ లను అభివృద్ధి చేసేందుకు "యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్" శాస్త్రవేత్తలు కసరత్తు ముమ్మరం చేశారు.. డయాక్స్ పేరుతో పిలిచే,యాంటీవైరల్ కోటింగ్ టెక్నాలజీ మాస్క్ యూజర్లకు ప్రాణాంతకం అయిన కరోనా వైరస్ క్రిముల నుంచి కాపాడుతుందని వైద్య శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మాస్క్ పై ఉండే యాంటి వైరల్ కోటింగ్ సమర్థవంతంగా నిర్వహిస్తుందని "కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ,సీనియర్ లెక్చరర్ డాక్టర్ గ్రాహం క్రిస్టి " పేర్కొన్నారు. ఫేస్ మాస్క్ ల పై ఉండే యాంటీ వైరల్ కోటింగ్ గంట వ్యవధిలోనే అన్నిరకాల కరోనా స్ట్రెయిన్ లను చంపి వేస్తుందని ఆయన తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి