హనుమంతుని జన్మ స్థలం కోసం వివాదం ఏంటి అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. తిరుమల ఏడుకొండలలో ఒకటైన అంజనాద్రి, శ్రీ రామ పరమ భక్తుని జన్మస్థలంగా టీటీడీ కమిటీ చెబుతుండగా, కర్ణాటక మరో వాదన వినిపిస్తోంది. ఈ విషయం ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్- కర్ణాటక మధ్యలో  వివాదం రేకెత్తిస్తోంది.


మన భారతదేశంలో ఆంజనేయ స్వామిని హనుమంతుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీపుత్రుడు , వాయుసుతుడు, వానర వీరుడు రామభక్తుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ధైర్యానికి ప్రతిరూపంగా, మనుషులకు పట్టిన పీడన వదిలించే దైవంగా, ఆంజనేయునికి దేశవిదేశాల్లో గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. శ్రీ రామదాసుని గా ప్రసిద్ధి చెందిన ఆంజనేయుడు పుట్టుక గురించి, ఎన్నో సంవత్సరాలుగా వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరికి వారే తమ ప్రాంతంలో పుట్టారంటూ.. పురాణాలు, ఇతిహాసాలు, సాంప్రదాయాలలో ముద్రించబడి ఉందనే వార్తలు  ప్రచారంలోకి వస్తున్నాయి.

కానీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం తమదైన శైలిలో హనుమాన్ పుట్టుక రహస్యం, అందుకు తగిన ఆధారాలను కూడా ప్రస్తావించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక రాష్ట్రం హనుమంతుడు పుట్టింది, పెరిగింది అంతా కర్ణాటకలోనే అనే కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. ఇలా రెండు రాష్ట్రాలు.. మా రాష్ట్రంలో హనుమంతుడు జన్మించాడు అంటే, మా రాష్ట్రంలో హనుమంతుడు జన్మించాడు అంటూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం పుట్టుకొచ్చింది.


అయితే ఇప్పటివరకు హనుమంతుడు ఎక్కడ జన్మించాడు అనే ఆధారాలు అయితే లేవు. కానీ భారతదేశం అంతటా చాలా ప్రదేశాలలో హనుమంతుడి ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరికి వారే తమ రాష్ట్రంలో పుట్టాడు అంటూ చెప్పుకుంటున్నారు. కొంతమందేమో మహారాష్ట్రలో అంటే ,  కొంతమందేమో కర్ణాటకలో అని ,  కొంతమందేమో గుజరాత్ లో అని ..ఇలా ఎవరికి నచ్చినట్టు వారు చెబుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే , మహారాష్ట్రలోని నాసిక్ - త్రయంబకేశ్వర్ లో ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం గా పిలిచే ఒక పర్వతం కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో ఐదు ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అవి తిరుమల కొండపై జపాలి, కడప జిల్లా గండి, కరీంనగర్ జిల్లా కొండగట్టు, పశ్చిమగోదావరి జిల్లా మద్ది ,  మద్దిమడుగు క్షేత్రాలు. ఇక ఈ క్షేత్రాలలో హనుమంతుడు స్వయంభూగా వెలిశాడు. అయితే  తిరుమల గిరిలోనే  ఆ పవన పుత్రుడు జన్మించాడు అనే కొత్త చర్చ మొదలైంది. అందుకు హనుమంతుడి జన్మ స్థానం ఆధారాల సేకరణకు డిసెంబర్లో టీ టీ డీ కమిటీని ఏర్పాటు చేసి, సమావేశమై చర్చించారు కూడా. పురాణాలను ,గ్రంథాలను కమిటీ పరిశీలించిన తర్వాత హనుమంతుడి జన్మ స్థానం అంజనాద్రి అని నిరూపించే ఆధారాలు ఉన్నట్లు కమిటీ ప్రకటించింది . అంతేకాకుండా ఈ ఆధారాలు ఇతర వివరాలతో సమగ్రమైన పుస్తకాన్ని కూడా ప్రచురించింది టీటీడీ. అంతేకాదు తిరుమలలో జపాలి తీర్థం హనుమంతుడు జన్మస్థలంగా స్కందపురాణంలో కూడా ప్రస్తావించారని కమిటీ తేల్చింది.


కర్ణాటక వాదన ఏమిటంటే ,హనుమంతుడు సంచరించినప్పుడు చూసిన వారు ఎవరూ లేరు. ఆనాటి గ్రంథాలు ,చరిత్రకారుల నుంచి మాత్రమే కాలాన్ని లెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు కర్ణాటక వాదన ఏమిటంటే , కొప్పల్ జిల్లా అనెగుడికి సమీపంలో ఉన్న అంజనాద్రి కొండను హనుమంతుడు జన్మస్థలంగా కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ స్థలాన్ని కిష్కింద అని కూడా పిలుస్తారు . అయితే రామాయణంలో కూడా కిష్కింద ప్రస్తావన ఉంది కాబట్టి హనుమంతుని జన్మ స్థలం కర్ణాటక  అని, కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది.

ఇక మరో వాదన ఏమిటంటే, హనుమంతుడు కర్ణాటక లోని అరేబియా సముద్రం ఒడ్డున జన్మించాడని వినిపిస్తోంది. శివమోగ లోని రామచంద్రాపురం మఠం అధిపతి రాఘవేశ్వర భారతి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రామాయణంలో సీత , హనుమంతుడు అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అని రాఘవేశ్వర భారతి చెబుతున్నారు. గోకర్ణ  హనుమాన్ జన్మభూమి అని నూతన కర్మభూమి అని కన్నడిగుల వాదనగా ఉంది.

ఇక ఎవరి వాదన వారిదే ,కానీ నిజానికి హనుమంతుడు ఎక్కడ పుట్టాడో మాత్రం సరైన ఆధారాలు లేకపోవడమే విచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: