ఇక ప్రతి ఒక్కరు గంటల తరబడి నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్లో కాలం గడుపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక ఇలా మొబైల్ కి బానిస గా మారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది తప్పా ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఎంతోమంది మొబైల్ కు బానిస గా మారిపోతున్న నేపథ్యంలో కొన్ని కొన్ని సార్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి మానసిక సమస్యలతో బాధపడటం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ చూస్తే మరికొంతమంది ఆన్లైన్ లో గేమ్స్ ఆడటానికి గంటలతరబడి మొబైల్ లో గడుపుతున్నారు.
అయితే కేవలం మనుషులు మాత్రమే కాదండోయ్ అటు కోతులు కూడా స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా మారిపోతున్నాయి అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇటీవలే ఒక కోతి స్మార్ట్ఫోన్ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ తెగ మురిసిపోతుంది ఆ కోతి. ఈ క్రమంలోనే రీల్స్ నీ పైన కిందికి మారుస్తూ మొబైల్ కి బానిస గా మారిపోయింది అని చెప్పాలి. పక్కన ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇది చూసిన వారు మనుషులే అనుకున్నా ఇప్పుడు కోతులు కూడా మొబైల్ కి బానిస గా మారి పోయాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి