భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది ప్రతి ఒకరి జీవితంలో ఒక గొప్ప వేడుక అన్న విషయం తెలిసిందే. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఏకం కావడం కాదు రెండు కుటుంబాలు ఏకం కావడం అని చెప్పాలి. ఇక బంధు మిత్రులందరికీ సమక్షంలో పెళ్లి జరుపుకుని నూతన వధూవరులు ఇక అందరి ఆశీర్వచనాలు పొంది సుఖసంతోషాలతో ఉండాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలాంటి అంగరంగ వైభవంగా జరిగే వేడుకలు మరింత ప్రత్యేకంగా మార్చుకోవడం కోసం ఇటీవల కాలంలో ఎంతోమంది కాస్త వినూత్నంగానే ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే పెళ్లి విషయంలోనే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్ విషయంలో కూడా కొంతమంది విచిత్రంగా ఆలోచిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కొంతమంది ఎవరు చేయని పనులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఏకంగా స్మశానంలో గొయ్యి తవ్వి అక్కడ ఇక చనిపోయినట్లుగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేసింది. ఇలాంటి పైత్యం  ఏంటి రా నాయన అనుకుంటూ కొంతమంది తిట్టుకున్నారు కూడా.


 ఇక ఎప్పుడూ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా మనం ఎక్కువగా ఇలాంటివి సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక కారు రోడ్డు మీద నిలబడినప్పుడు ఏకంగా హీరో హీరోయిన్ ను వెనకాల బైక్ మీద ఎక్కించుకొని ఏకంగా ఆ కారు మీద నుంచి బైక్ పోనిస్తూ ఉంటాడు. చేజింగ్ సీన్లలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఇటీవల పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న నూతన వధూవరులు తమ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లో కూడా ఇలాంటిదే చేసి అందరిని అవాక్కయ్యేలా చేశారు. ఏకంగా క్రేన్ సాయంతో ఒక జీప్ మీదుగా బైక్ ఎత్తడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఇక ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తూ ఉండడం గమనార్హం. వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: