ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోతూ ఉండడం.. టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రకాల మార్పులు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం నగరాలలో ఎక్కడ చూసినా కంటి చూపు మేరలో పెద్దపెద్ద బిల్డింగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇలా పెద్ద పెద్ద భవనాలను నిర్మించడంలో వ్యాపారులందరూ కూడా బిజీబిజీగా మారిపోయారు అని చెప్పాలి  అయితే కొన్ని కొన్ని సార్లు ఇక ఇలా భారీ భవనాలను నిర్మిస్తున్న సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సరైన ఇంజనీర్లు భవనాలను నిర్మించకపోతే మాత్రం ఏకంగా కోట్లు పెట్టి కట్టించిన భవనం కాస్త క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. మరి కొన్నిసార్లు ఏకంగా పురాతన భవనాలు కళ్ళముందే చూస్తుండగా కుప్పకూలిపోవడం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇప్పుడు వరకు ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా ఇక ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా ఒక పురాతన భవనం పేక మెడల ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్ లో నాలుగు అంతస్తులు భవనం కుప్పకూలిపోవడంతో స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక.. ప్రాణభయంతో పరుగులు పెట్టారు అని చెప్పాలి. అయితే ఇలా భవనం కుప్పకూలిన సమయంలో దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు అని చెప్పాలి. అయితే సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అగ్నమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


 గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ ఆ ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆ పాత భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు  గుర్తు చేశారు. అయితే ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందట. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సీసీటీవీలో రికార్డు కావడంతో ఇక ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: