ఇటీవల కాలంలో అతి చిన్న వయసు వారు కూడా గుండెపోటు సమస్యలతో మరణిస్తూ ఉండడంతో ప్రజలలో చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదంతా కేవలం కోవిడ్ కారణంగానే గుండెపోటు వస్తోందని అనుమానాలు ప్రజలలో ఎక్కువవుతున్నాయి. వీటిపైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పందించడం జరిగింది. ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈయన మాట్లాడడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.


ఎక్కువమంది యువ క్రీడాకారులు, కళాకారులు స్పోర్ట్స్ పర్సన్ ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే చూశాము.. కోవిడ్ గుండెపోటు మధ్య సంబంధం ఉందేమో అని పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చాలా ప్రయత్నాలు చేస్తోంది అంటూ తెలిపారు.. దీనికోసం ఒక పరిశోధనలు కూడా ప్రారంభించామని తెలియజేశారు.ఈ పరిశోధన ఫలితాలు రెండు మూడు నెలల లోపు రావచ్చు అని తెలియజేయడం జరిగింది. కోవిడ్ మహమ్మారి వల్ల నాలుగు ప్రభంజనం వచ్చే అవకాశాల గురించి కూడా మాండవీయ మాట్లాడుతూ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


గతంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF -7 వచ్చిందని ఇప్పుడు..XBB 1.16 సబ్ వేరియంట్ వచ్చిందని దీనివల్ల ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతున్నదని తెలియజేయడం జరిగింది.. సబ్ వేరియంట్ చెప్పుకో తగ్గిస్తాయిలో ప్రమాదం కలిగించే అవకాశం ఉండనేది ఆరోగ్య మంత్రి శాఖ అనుభవాలను బట్టి తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది.ప్రస్తుతం అన్ని వేరియంట్ల పైనా మన వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విషయాలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఈ మధ్యకాలంలో కరోనా కేసులు కూడా తీవ్రంగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరి కోవిడ్ కు గుండెపోటుకు మధ్య సంబంధం ఉందా లేదా అనే విషయం మరొక కొద్ది రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: