ఇక ఈ 2025 సంవత్సరాన్ని ఎంతో గ్రాండ్ గా ఆనందంగా మొదలుపెట్టాము కానీ సగం సంవత్సరం పూర్తయ్యలోపే ఆశలు గంగ పాలయ్యాయి .. భూకంపాలు , కారుచులు, ఉగ్రదాడులతో పాటు మానవ కల్పిత విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి .. ఇజ్రాయిల్ , ఇరాన్ యుద్ధం .. ఆపరేషన్ సింధూరను అనుసరించి భారత్ , పాక్ ఘర్షణ వంటి కీలక సంఘటనలు ఈ సంవత్సరం అస్థిరతకు  నిదర్శనం .. శ‌నిగ్రహం మీనరాశి లోకి ప్రవేశించడం వంటి గ్రహ స్థితిగతులు ఈ విపత్తులకు కారణమా , లేక ఇది వీధి నిర్ణయమా అని చాలామందిలో ఎన్నో  ప్రశ్నలు మెదులుతున్నాయి ..అలాగే ఎంతో మంది జ్యోతిష్యులు మునుముందు రోజుల్లో మరింత పెద్ద యుద్ధాలు , సంఘర్షణ వస్తాయని అంచనా వేస్తున్నారు .. స్వామి యోగేశ్వరానంద గిరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేం 30న ఏర్పడిన గ్రహ స్థితిగతులు మహాభారతం కాలంలో ఏర్పడిన వాటిని పోలి ఉన్నాయని ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసి భారతదేశానికి స్వర్ణ యుగాన్ని తీసుకురావచ్చు అని అంటున్నారు ..


ఈ గ్రహ స్థితులు గణితాత్మకంగా మహాభారతం కాలం లేదా గతంలో పెద్ద యుద్దాల సమయంలో కనిపించిన వాటిని పోలి ఉన్నాయని కూడా అంటున్నారు .‘ఇండియన్ నోస్ట్రడామస్’గా పేరుగాంచిన కుశాల్ కుమార్  అనే మరో భారతీయ జ్యోతిష్యుడు కూడా మూడవ ప్రపంచ యుద్ధం గురించి అంచనా వేశారు .. రష్యా , ఉక్రెయిన్ యుద్ధం , ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణలు తాను ముందే ఊహించాన‌ని ఆయన చెప్పుకొచ్చారు .. అలాగే కొన్ని శతాబ్దాల క్రితం ఫ్రెంచ్ జ్యోతిష్యుడు వైద్యుడు నోస్ట్రాడామస్  కూడా 2025లో ప్లేగు , ఆస్ట్రాయిడ్ ఢీకొనడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని ఇలాంటి అనేక ఘోరమైన సంఘటనలు ముందుగానే అంచనా వేశాడు . అలాగే ప్రధానంగా 2025 జూన్ , జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా అస్థిరంగా ఉంటాయని యుద్ధాలు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా పెరుగుతాయని జ్యోతిష్య నిపుణు చెప్పుకొస్తున్నారు .. అలాగే జూన్ 7 నుంచి జూలై 28 మధ్య అంగారకుడు, కేతువుల కలయిక .. ఇది పెద్ద సంఘర్షణకు , రాబోయే ప్రమాదాలకు కారణం కాబోతుందని .. భూకంపాలు , అగ్ని ప్రమాదాలు , యుద్ధాలు , ఇతర ప్రధాన సంఘటనలకు దారి తీయవచ్చు  .. ఇదే విధమైన ప్రమాదకరమైన కాలం మళ్లీ 2026  జనవరి-మార్చి మధ్య తిరిగి రావచ్చు అని అంచన వేస్తున్నారు .


ఇదే క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  పలు పోస్టులు ప్రకారం 2025 క్యాలెండర్ .. 1941 నాటి క్యాలెండర్ కు సరిగా సరిపోతుందని హైలెట్ చేస్తున్నారు .. 1941లో జపాన్ పర్ల్ హార్బర్‌పై దాడి చేసి  అమెరికాను రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగింది .. అలాగే ఈ క్యాలెండర్  సారూప్యత కేవలం యాదృచ్ఛికం అయినప్పటికీ ఇది గత ప్రపంచ సంక్షోభాలను గుర్తుచేస్తుంది .. అలాగే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి తేదీ వారం అదే రోజున వస్తుంది . 1941 హింస నియంతృత్వ విస్తరణ దౌత్య వైఫల్యంతో నిండిన సంవత్సరంగా మారింది .. ఇక ఇప్పుడు 2025 క్యాలెండర్ దానికి సరిపోవటం జరుగుతున్న పరిణామాలతో కొంతమందిలో భయాన్ని కలిగిస్తుంది .. అయితే ఈ క్యాలెండర్ ఇలా సరిపోవటం అంటే చరిత్ర  పునరావృతం అవుతుందని కాదు .  ఇది కేవలం  గ్రెగోరియన్ క్యాలెండర్ర్ వ్యవస్థలో ఒక యాదృచ్ఛికం .. ఇటువంటివి ఎప్పుడూ తరచుగా జరుగుతూ ఉంటాయి .. అయినప్పటికీ కూడా ఈ సిద్ధాంతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది .. ప్రధానంగా నెటిజన్లు హిస్టరీ రిపీట్ అవుతుంది సంకేతాలు చూడండి అంటూ ఆనాటి పాత విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .. ఇవే ప్రజలను ఒకింత భయాందోళనకు నెట్టేస్తున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: