
మరీ ముఖ్యంగా విండ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి చేరుకున్న రెండో భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు "శుభాంశు శుక్లా". అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు వెళ్లిన తొలి ఇండియన్ గా చైర్త్ర లో నిలిచిపోతాడు "శుభాంశు శుక్లా". "శుభాంశు శుక్లా" అంతరిక్ష ప్రయాణనికి బయిలుదేరే ముందు తనకు ఎంతో ఇష్టమైన ఒక పాటను విన్నారు. ఆ పాట మరేంటో కాదు గత ఏడాది రిలీజ్ అయిన " ఫైటర్ " సినిమాలోని "వందేమాతరం" పాట.
ఈ పాట వింటే గూస్ బంప్స్ పక్క. ప్రతి ఒక్క ఇండియన్ రోమాలను నిక్కబొడుచుకునే పాట ఇది. ఈ పాట అంటే ఆయనకు చాలా చాలా ఇష్టమట . అందుకే అంతరిక్షంలోకి వెళ్లే ముందు ఆయన తన ఫేవరెట్ అయిన ఈ పాటను విన్నారట ." విజయం అనేది ప్రతి భారతీయుడు నరాల్లో ఉంటుంది . మన పరాక్రమానికి శత్రువు కూడా సెల్యూట్ చేయాల్సిందే " అంటూ సాగే ఈ పాట దేశభక్తిని కలగజేస్తుంది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ రూపొందించిన ఫైటర్ లో బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్ అదే విధంగా దీపిక పదుకొనే తదితరులు నటించి మెప్పించారు . ఈ పాట ఎప్పుడు విన్నా సరే తెలియని గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది. దేశభక్తిని చాటే పాట ఇది . ఈ పాట వినే "శుభాంశు శుక్లా" తన జర్నీ స్టార్ట్ చేయడం ఇంకా హైలైట్ గా మారింది . కాగా ఫ్లోరిడాలోని నాటి స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలకన్ 9 రాకెట్ను ప్రయోగించారు. దీనికి "శుభాంశు శుక్లా" మిషన్ పైలెట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..!!