సాధారణంగా ఇంటి ఓనర్లు ఎంత టార్చర్ పెడుతూ ఉంటారు అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది . మరీ ముఖ్యంగా కొన్నిసార్లు సొంత ఇల్లు ఉన్న ఉద్యోగాల రిత్యా వేరే ఊర్లు  వెళ్ళినప్పుడు వేరే స్టేట్స్ లో సెటిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎక్కువగా అద్దె ఇల్లు తీసుకుంటూ ఉంటారు జనాలు . ఆ టైంలో చాలామంది రకరకాల కండిషన్స్ పెడుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా బ్యాచిలర్స్ కి అయితే అసలు అద్దెకే ఇవ్వము అంటూ రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు . ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇల్లు ఇచ్చిన పిల్లలు గోడల మీద రాయకూడదు అని.. గోడకు మేకులు కొట్టకూడదు అని ..సౌండ్స్ రాకూడదు అని టైల్స్ పాడవకూడదు అని రకరకాల కారణాలు కండిషన్స్  పెడుతూ ఉంటారు.


దానికి తగ్గట్టే అడ్వాన్స్ పేమెంట్ లు కూడా ముందు తీసుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా బెంగళూరులో ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం . ఎవరైనా బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలి అనుకుంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది . ఇంటి అడ్వాన్సులే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు . మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ ఇంటికి అయిన  డ్యామేజ్ ని అడ్వాన్స్ లో పట్టుకుంటూ ఉంటారు . చాలామందికి ఇంటి ఓనర్లు అంటే ఇదే ఒపీనియన్ ఉంటుంది . కానీ ఇప్పుడు మీరు తెలుసుకునే విషయం మాత్రం చాలా చాలా ఆశ్చర్యపోయేలా అనిపిస్తుంది.

 

తన ఇంటి ఓనర్ ఓ మంచి వ్యక్తి అని చెబుతూ ఒక యువకుడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా..?  అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు . ఒక అపార్ట్మెంట్ లో దాదాపు రెండేళ్లపాటు అద్దెకి ఉన్నాను అంటూ యువకుడు పోస్టులో తెలిపాడు . అంతేకాదు అక్కడ ఉన్నన్ని రోజులు ఇంటి ఓనర్ తనను సొంత కొడుకుల ఆదరించి పెంచాడు అని వివరించారు . ఏ సహాయం కావాలి అన్న కూడా వెంటనే చేసి పెట్టేసేవాడట.  ఇంటి ఓనర్ స్కూటర్ అవసరమైన సందర్భాలలో తీసుకుని వాడుకునే వాడిని కూడా చెప్పుకొచ్చారు.



అయితే తమ మధ్య ఒక్కసారి కూడా మిస్ అండర్స్టాండింగ్ రాలేదు అంటూ చెప్పారు . చివరకు ఇల్లు ఖాళీ చేసే సమయంలో ఓనర్ తనకు ఒక వెండి కడియాన్ని గిఫ్టుగా ఇచ్చారు అంటూ పోస్టులు చెప్పుకొచ్చాడు.  ఇలాంటి మంచి వ్యక్తి తనకు జీవితంలో ఎప్పుడు తారాసపడలేదు అని చెప్పి సంబరపడిపోయారు. బెంగళూరులో ఇంటి ఓనర్లు కనీసం ఇచ్చిన అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇవ్వరు. కానీ మా ఇంటి ఓనర్ మాత్రం చాలా చాలా మంచి ఆయన నాకు ఫేర్వెల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు అని ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్తా  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలామంది ఇలాంటి ఓనర్ మాకు ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  మరికొందరు ఆ ఇంటి అడ్రస్ చెప్పు నేను వెళ్లి జాయిన్ అవుతాను అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . మానవత్వం అంటే ఇదే అంటూ మరికొందరు ఆయనను ప్రశంసించేస్తున్నారు.  ఈ ఇంటి ఓనర్ నుంచి స్ఫూర్తి పొంది ఇతరులు కూడా అలాగే వ్యవహరించాలని యువకుడు కొందరికి సూచించారు . సమాజానికి మనం ఇచ్చేది ప్రతిఫలంగా తిరిగి వస్తుందన్న విషయం మరిచిపోవద్దు అంటూ తన పోస్టులో చెప్పుకొచ్చాడు.  ఆ యువకుడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: