అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ ఎదురుచూస్తుంది. ఆ పిలుపు కోసం ప్రతి క్షణం ఆరాటపడుతుంది. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు కొంతమందికి రక్తస్రావం అవుతుంది. అలా రక్తస్రావం అవ్వడాన్ని చూసి చాలా మందికి  భయం కలగచ్చు. కానీ గర్భం ధరించిన మొదటి మూడు త్రైమాసికంలో ఇది చాలా సాధారణం. కానీ ఎలాంటి అపాయము కలిగించదు..గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో మొదటి త్రైమాసికంలో రక్తస్రావం సాధారణంగా ఏర్పడుతుంది, వీరిలో కొందరికి మాత్రమే భారీ రక్తస్రావం ఏర్పడుతుంది. కానీ ఇలా ఎక్కువగా రక్తస్రావం జరిగితే అపాయం కలుగుతుంది. ఇది కేవలం మూడు రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు ఉంటుంది. రక్తస్రావం యొక్క కారణాలు ఎగ్ ఇంప్లాంటేషన్ గుడ్డు ఫలదీకరణ గర్భాశయం యొక్క పొరల్లో జరిగినప్పుడు రక్తస్రావం ఏర్పడుతుంది. చాలామంది మహిళలు ఈ రక్తస్రావాన్ని తమయొక్క సాధారణ ఋతు స్రావం అని అనుకుంటారు.




 గర్భిణిగా ఉన్నప్పుడు రక్తస్రావాన్ని ఆప గలిగే హార్మోన్ల అసమతుల్యత వలన రక్తస్రావం కలుగుతుంది. ఇది మీకు ఎలాంటి హానీ కలిగించదు ఎందుకంటే మీ అండాశయం నుండి ప్లాసెంటా ఈ హార్మోన్లను ఉత్పత్తి చేసి రక్తస్రావాన్ని ఆపుతుంది. కొందరికి ఈ రక్తస్రావం గర్భధారణ సమయం మొత్తం ఉండొచ్చు. వీటి యొక్క లక్షణాలు మీ మామూలు ఋతు స్రావం సమయంలో కలిగేటువంటి తిమ్మిరి,  వెన్నునొప్పి లాంటివి. దీని వలన చాలా మంది మహిళలు మొదటి త్రైమాసికంలో దీనిని నెలసరి ఋతు స్రావం అని అనుకుంటారు. సెక్స్ గర్భం ధరించిన తరువాత సెక్స్ వలన రుతుస్రావం ఏర్పడుతుంది. ఇది ఎలాంటి హాని కలిగించదు.  మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు లేదా గర్భస్రావం లాంటి సమస్యలు ఉన్నట్లయితే సెక్స్‌ను తాత్కాలికంగా ఆపడం మంచిది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గుడ్డు యొక్క ఫలదీకరణ గర్భాశయం బయట అనగా ఫెలోపియన్ ట్యూబ్ (అండాశయము నుండి గర్భకోశమునకు గల నాళ మార్గము) లో జరిగినప్పుడు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కలుగుతుంది.



అయితే  కడుపులో వికారం అనిపించటం, మీ ఉదరంలో క్రామ్ప్స్ రావటం, నొప్పి, మైకముగా ఉంటుంది. ఈ నొప్పి తగ్గిపోయినట్టు అనిపించినప్పటికీ ట్యూబ్ లో చీలికలు ఏర్పడితే మల్లి నొప్పి పుట్టవచ్చు. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇది ఫెలోపియన్ ట్యూబ్ చీల్చి అంతర్గత రక్తస్రావానికి(ఇంటర్నల్ బ్లీడింగ్) దారితీస్తుంది. ఇటువంటి ఎమర్జెనీ సమయంలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితి ఉన్నట్లయితే శిశువుకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు మీకు చాలా విశ్రాంతి అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: