స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఆంగ్లేయులకు ఎదురుగా పోరాడి అమరులైన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆంగ్లేయులపై పోరాడిన తీరు అద్భుతం. అయితే ఆంగ్లేయులపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారిలో ప్రీతిలత వడ్ఢేదార్ ఒకరు.ఆమె బ్రిటిష్ వారి పై పోరాడి అమరురాలైయ్యింది.

ప్రీతిలతది చిట్టగాంగ్. ఆమెకు చిన్నప్పటినుంచే దేశభక్తి ఎక్కువగా ఉండేది. ఒకసారి ఉన్నత విద్య కోసం కోల్ కతాకి  వచ్చినపుడు లీల నాగ్ అనే మహిళా దీపాలి అనే ఒక విప్లవ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘము  పట్ల ఆకర్షితురాలైన ప్రీతిలత అందులో చేరింది. అయితే దీపాలి సంఘం చిట్టగాంగ్ లోని ఆంగ్లేయుల ఆయుధ కర్మాగారం పై దాడి చేయాలనీ ప్లాన్ చేసారు. అందులోని యుద్ధ సామాగ్రిని తీసుకోవాలని మరియు అక్కడి కమ్యూనికేషన్ వ్యవస్థల్ని నాశనం చేయాలనీ పక్క ప్లానింగ్ రెడీ చేసారు.

అయితే ఈ ప్లాన్ ని సక్రమంగా అమలు చేసేలా బాధ్యతలను ప్రీతిలతకి అప్పజెప్పారు. ఆమె మరియు కొంతమంది  సభ్యులతో కలిసి చిట్టగాంగ్ లోని ఆయుధ స్థావరంపై దాడి చేసారు. అయితే వారికీ మందు సామాగ్రి, తుపాకులు ఏమి లభించకపోవడం విశేషం. కానీ కమ్యూనికేషన్ వ్యవస్థల్ని వాళ్ళు నాశనం చేయగలిగారు. ఇక ఆ తర్వాత  ఒకరోజు అదే ప్రాంతంలోని యూరోపియన్ క్లబ్ పై దీపాలి సంఘం  వాళ్ళు దాడి చేసారు. ఈ క్లబ్ బయట ఇండియన్స్  వారికీ అనుమతి లేదంటూ ఒక బోర్డు ని పెట్టారు. దీంతో ఆగ్రహించిన దీపాలి సంఘ సభ్యులు ఆ క్లబ్ పై దాడి జరుపగా, ఆంగ్లేయులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రీతిలతకి తీవ్ర గాయాలు అయ్యాయి.

దీపాలి సభ్యుల వెంబడి బ్రిటిష్  సేన తరుముకురావడంతో వారి చేతుల్లో చిక్కకూడదని భావించిన ప్రీతిలత  తనకు తానే బలిదానం చేసుకుంది. ఆలా తన ప్రాణాలను దేశం కోసం అర్పించింది. ఆమె చేసిన త్యాగానికి నివాళిగా ఇప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్ కత లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటుచేసింది.మనకి ఝాన్సీ లక్ష్మి భాయ్,రుద్రమ దేవి వంటి ధీర వనితల గురించి తెలిసినంతగా ప్రీతిలత వడ్ఢేదార్ వంటి యోధురాలు గురించి తెలియకపోవచ్చు. కానీ భారత జాతి ఆమె చేసిన త్యాగాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: