
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఖాళీగా అస్సలు ఉండకూడదని చెబుతున్నారు. అంతేకాదు.. ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు మదిలో మెదిలి.. చివరకు ఒత్తిడికి దారి తీస్తాయని చెప్పుకొచ్చారు. ఇక గర్భిణులు వీలైనంత వరకు ఎప్పుడూ బిజీగా ఉండేందుకే ప్రయత్నించాలని చెబుతున్నారు. గర్భిణీలు వంటలు చేయడం, పెయింటింగ్, అల్లికలు, పాటలు పాడటం ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇక కొంతమంది గర్భిణులకు కంటి నిండా నిద్ర లేక పోయినా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలా కాకుండా గర్భిణీలు ఎక్కువ విశాంత్రి తీసుకోవాలని అంటున్నారు. ఇక అప్పుడే తల్లీ కడుపులోని బిడ్డ యాక్టివ్‌గా ఉంటారని చెబుతున్నారు. అయితే గర్భిణీలు మసాలా ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కెఫిన్ ఫుడ్స్, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.
అంతేకాదు.. ఒత్తిడికి దూరంగా ఉండాలీ అనుకుంటే పుస్తకాలు చదవడం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చున్నారు. కాగా.. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు మంచి మంచి పుస్తకాలు చదివితే ఒత్తిడి దరి చేరకుండా ఉంటుందని అన్నారు. అంతేకాక ఆధ్యాత్మిక పుస్తకాలను చదివితే ఇంకా మంచిదని తెలిపారు. గర్భిణీలు సమయంలో ప్రతి మహిళా రోజుకు కనీసం పావు గంట అయినా మెడిటేషన్ చేయాలని సూచించారు. దీని ఫలితంగా ఒత్తిడి దరి దాపుల్లోకి రాకుండా ఉంటుందని అన్నారు.