వివిధ రంగాలలో విశిష్ట కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇస్తుంది. కాగా, తెలుగు దర్శకుడు పి.పుల్లయ్య గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోయినా సినిమా పరిశ్రమలో ఆయను అంతా పద్మశ్రీ పి.పుల్లయ్య గారు అని సంభోదించేవారు. విషయమేమిటంటే, పుల్లయ్య గారు ‘పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్’ అనే స్వంత నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్ మీద కొన్ని హిట్ సినిమాలను తెరక్కించారు. దీంతో ఆయనను పద్మశ్రీ పుల్లయ్య అని పరిశ్రమలో చాలా మంది పిలిచేవారు.  దీంతో, ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోయినా దర్శకుడు పుల్లయ్యగారు ఆ అవార్డు పొందారని నటుడు గుమ్మడి చమత్కరించేవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: