
అలాగే రవితేజ - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాంటేజ్ సాంగ్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. త్వరలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయితే ప్రమోషన్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది. ఇక సంక్రాంతి బరిలో దిగబోతున్న రవితేజ – సుధాకర్ చెరుకూరి సినిమా షూటింగ్ షెడ్యూల్ కూడా చిక్కుల్లో పడే అవకాశముంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామా "పెద్ది" తాజా షెడ్యూల్ ప్లాన్ కూడా ఆలస్యం కావొచ్చన్న టెన్షన్. కొత్త నిబంధనలే సమస్య? సమస్య తాలూకు రూట్ ఏమిటంటే ... ఉద్యోగ నిబంధనలపై నిర్మాతల సమాఖ్య – కార్మికుల ఫెడరేషన్ మధ్య తలకోరు.
నిర్మాతలు:
“6–6, 9–9 కాల్షీట్లు కావాలి.”
“12 గంటలు సెట్లో ఉంటేనే వేతనంలో 15% పెంపు.”
“తొలిగించే సెలవులు తప్ప, మూడు ఆదివారాలే సెలవులు.”
కార్మిక ఫెడరేషన్ మాత్రం గట్టిగా: “ 30% పెంపు అమలైతే తప్ప షూటింగ్ లేదు.” ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నా, ఇంకా ఫలితం మాత్రం తేలలేదు. ఎవరికీ ఇబ్బంది? ఎవరికీ కాదు? బడా బానర్లకు అయితే తాత్కాలికంగా సమస్య ఏమీ లేదని తెలుస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ కొనసాగుతుందని నిర్మాత ఎర్నేని తెలిపారు. అలాగే వైజయంతి మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి సంస్థలకి తాత్కాలిక బ్రేక్ ప్రభావం పెద్దగా లేదు.
చిరు చొరవ – ఎప్పుడు రిలీఫ్? .. సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చొరవ తీసుకున్నా, ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. చర్చలు జరిపినా, “సమ్మె విరమించాం” అనే లైన్ వినిపించలేదు. ఇద్దరు వర్గాలు తమ వాదనలతో గట్టిగా నిలబడడంతో ఆగస్ట్ షెడ్యూల్స్ అంతా టెన్షన్‌లో పడిపోయాయి. మొత్తానికి... టాలీవుడ్ వేదికపై ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ కాదు... స్ట్రగుల్ స్టార్ట్! పెద్ద సినిమాల ప్లాన్ సెట్స్‌లో కాకుండా ఫెడరేషన్ మీటింగ్ హాళ్లలో నడుస్తోంది! 2–3 రోజుల్లో ఎలాంటి నిర్ణయం వస్తుందోనన్నది... ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తోంది!