రాత్రివేళ తినే ఆహారం తేలికగా మరియు సులభంగా జీర్ణం అయ్యేలా ఉండాలని డాక్టర్లు చెబుతుంటారు. లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేమి, బరువు పెరగడం వంటివి ఎదుర‌వుతాయి. ఈ నేపథ్యంలోనే రాత్రుళ్లు కచ్చితంగా ఎవైడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


నైట్ టైమ్ మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. చికెన్, మటన్, చేపలు, రొయ్య‌లు వంటి మాంసాహారం ఎక్కువ ప్రోటీన్ మరియు కొవ్వులు కలిగి ఉంటుంది. రాత్రివేళ‌ శరీరం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లే టైమ్‌లో ఇవి జీర్ణించడానికి శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి, ఫలితంగా బరువు పెరగడం లేదా జీర్ణ సమస్యలు త‌లెత్తుతాయి.


అలాగే రాత్రివేళ ఐస్ క్రీమ్, చాక్లెట్, స్వీట్స్‌ను క‌చ్చితంగా ఎవైడ్ చేయాలి. ఎందుకంటే ఇవి శరీరంలో షుగర్ లెవల్స్‌ను మార్చి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. వేపుడు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, చీజ్ ఎక్కువగా ఉన్న ఆహారం నైట్ టైమ్ తీసుకోకూడ‌దు. ఇవి గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతాయి.


ముల్లంగి, బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఫుడ్స్‌ను నైట్ టైమ్ దూరం పెట్టాలి. కొంద‌రు రాత్రుళ్లు టీ, కాఫీ తాగుతుంటారు. కానీ ఈ అల‌వాటును వెంట‌నే మానుకోండి. నైట్ టైమ్ కెఫిన్ ఉండే కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ ను తీసుకుంటే మీ స్లీప్ సైకిల్ తీవ్రంగా ప్ర‌భావితం అవుతుంది. బ‌రువు కూడా పెరుగుతారు.


నైట్ టైమ్ పెరుగును ఎవైడ్ చేయాలి. పెరుగు వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌వ‌చ్చు. కాబ‌ట్టి పెరుగుకు బ‌దులు ప‌ల్చ‌టి మ‌జ్జిగ తాగొచ్చు. అదేవిధంగా రాత్రుళ్లు వైట్ రైస్ ను ప‌క్క‌న పెట్టేసి మ‌ల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు, పుల్కాలు చేసుకుని తీసుకుంటే శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. వెజిటబుల్ సూప్, కిచిడీ వంటి ఫుడ్స్ కూడా నైట్ టైమ్ త్వ‌ర‌గా జీర్ణం అవుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: