ఏంటి ఆ దర్శకుడి కొడుకు జీవితాన్ని రాంగోపాల్ వర్మ నాశనం చేశారా.. ఇంతకీ రాంగోపాల్ వర్మకి ఆ డైరెక్టర్ కొడుకుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి..ఎందుకు ఆ డైరెక్టర్ ఆర్జీవి పై ఆరోపణలు చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రవి రాజా పినిశెట్టి.. ఈ డైరెక్టర్ పేరు తెలియని వారు ఉండరు. అయితే ఇప్పటి జనరేషన్ వారికి ఎక్కువగా తెలియక పోయినప్పటికీ ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు తీసిన రవి రాజా పిని శెట్టి అంటే అందరికీ సుపరిచితులే. అయితే ఎంతోమంది హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే తన బాటలోనే తన పెద్ద కొడుకుని కూడా సినిమాల్లోకి డైరెక్టర్ గా తీసుకురావాలి అనుకున్నారట. అయితే చిన్న కొడుకు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. 

ఆయనే ఆది పినిశెట్టి.. పలు సినిమాల్లో విలన్ గా..హీరోగా..రాణిస్తున్న ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రవిరాజా పినిశెట్టి పెద్ద కొడుకు సత్య ప్రభాస్ శెట్టి ని డైరెక్టర్ గా చూడాలనుకున్నారట. అయితే తాను కూడా డైరెక్టర్ అయినప్పటికీ వేరే డైరెక్టర్ దగ్గర దర్శకత్వాన్ని బాగా నేర్చుకుంటాడని ఆలోచించుకొని రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్షన్ నేర్చుకోమని పంపించారట.కానీ తీరా అక్కడికి వెళ్ళాక రాంగోపాల్ వర్మ సినిమాలు చూస్తేనే డైరెక్షన్ వస్తుంది.ఒకరి దగ్గర పని చేస్తే డైరెక్షన్ రాదు.నీకు వీలున్నన్ని సినిమాలు చూడు. నీకు ఏది నచ్చితే అదే చెయ్. ఒకరి దగ్గర నేర్చుకోవాలి అనుకోకు అది ఎప్పటికీ రాదు.

మీ నాన్న కూడా ఓ డైరెక్టర్ కాబట్టి నీకు నచ్చిన కథతో ముందు ఓ సినిమా తియ్.. అలా అయితే నువ్వు డైరెక్షన్ నేర్చుకోగలవు అని చెప్పారట. అయితే ఆర్జీవి మాటలు సత్య ప్రభాస్ శెట్టికి బాగా ఎక్కాయట. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం మానేసి తానే స్వయంగా మలుపు అనే సినిమాతో డైరెక్టర్ గా మారారు.అయితే ఈ సినిమా కామెడీ, మిస్టరీ జానర్లో మంచి హిట్ కొట్టింది.అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ ఆర్జీవి మాటల ప్రభావం తన కొడుకుపై బాగా చూపించింది అని,తన కొడుకుని ఆర్జీవి దగ్గరికి పంపించి పెద్ద తప్పు చేశాను అంటూ రవి రాజా పినిశెట్టి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: