తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో కొత్త సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అంటూ చాలా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీ ,కన్నడ, తమిళ్ వంటి భాషలలో కూడా చాలామంది ప్రేక్షకులు రియాల్టీ షో కోసమే ఎదురు చూస్తున్నారు.. తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే 8 సీజన్లు పూర్తికాగా సెప్టెంబర్ 7న 9వ సీజన్ మొదలు కాబోతున్నట్లు వినిపిస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎక్కువగా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పాపులారిటీ అయినవారు, ఫేమస్ యూట్యూబర్స్ వంటి వారు పాల్గొంటూ ఉంటారు.


అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఒక లెస్బియన్ జంట కూడా అడుగుపెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. దీంతో వీరు గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ తెలుగులో కాదు కానీ మలయాళ బిగ్ బాస్ సీజన్ -7 లో. మోహన్లాల్ హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షో చాలామంది నటీనటులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొనడం జరిగింది. ఈసారి ఇందులో ఆదీలా, ఫాతిమా అలాంటి లెస్బియన్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


కేరళ ప్రాంతానికి చెందిన ఆదీలా, ఫాతిమా ఇద్దరు కూడా సౌదీ అరేబియాలో ఎక్కువగా ఉంటున్నారు. వీరి మొదటి పరిచయం కూడా అక్కడే జరిగిందట ఇంటర్ చదివేటప్పుడు మొదటిసారి అక్కడ పరిచయం కాగా ఆ పరిచయం స్నేహితులుగా మారిందని ఆ స్నేహం ప్రేమగా మారిందని ఇద్దరు కలిసి జీవితాంతం జీవించాలనుకున్న సమయంలో వీరి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారట. ఇద్దరినీ కూడా విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడంతో వీరిద్దరూ తమ ఇల్లును వదిలేసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఫాతిమాతో ప్రేమ విషయంపై అదీలా కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కేరళ హైకోర్టు మాత్రం వీరిద్దరితో చర్చించిన తర్వాతే వీరిద్దరికీ కలిసి జీవించే హక్కు కల్పించింది.. వీరికి మద్దతుగా ఒక వర్గం కూడా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: