సుజుకీ సంస్థ నుండి అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్స్ ఉత్పత్తి చేసే సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆ కంపెనీ ద్విచక్రవాహనాలను BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు తగిన విధంగా మార్పులు చేస్తోన్న ఈ ఆటో సంస్థ త్వరలో సుజుకీ తన v - స్ట్రోమ్ 650 XT మోడల్ ను భారత మార్కెట్ లో విడుదల చేయనుంది. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్ పోలో ఈ బైక్ ను ఆవిష్కరించింది.  దీనికి సంబంధించిన బైక్ వివరాలను అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది సుజుకీ. కాకపోతే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు అమలులో ఉన్న కారణంతో లాక్ డౌన్ తర్వాత ఈ మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.


 
ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ పసుపు & నలుపు, తెలుపు & నీలం కలర్ కాంబినేషన్ లో ఇప్పటికే అందుబాటులోకి కంపెనీ తీసుక వచ్చింది. అయితే నలుపు & నీలం అనే కొత్త కలర్ ఆప్షన్ తో రాబోతుంది సుజుకీ v - స్ట్రోమ్ 650 XT. ఇక ఈ బైక్ ఇంజెన్ విషియానికి  వస్తే..BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన సుజుకీ v - స్ట్రోమ్ 650 XT మోటార్ సైకిల్.. 645 cc వీ-ట్విన్ మోటార్ ను ఇది కలిగి ఉంది. దీని BS - 4 మోడల్ 71 BHP బ్రేక్ హార్స్ పవర్, 62.3 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే త్వరలో విడుదల కానున్న BS - 6 వాహనం మాత్రం పవర్ ఔట్ పుట్ కొంచెం ఎక్కువ కాబోతుంది.

 


అలాగే ఫీచర్లు విషయానికి వస్తే ...సుజుకీ v - స్ట్రోమ్ 650 XT మోటార్ సైకిల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్, అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ లాంటి ప్రత్యేకతలు ఇందులో పొందుపరిచారు. దీనితో పాటు మూడు లెవళ్ల ట్రాక్షన్ కంట్రోల్, ఈజీ స్టార్ట్ సిస్టం, అనలాగ్ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఇందులో పొందు పోరిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: