ప్రముఖ మోటర్ సంస్థ హోండా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదిరిపోయే మోటర్ వాహనాలను అందిస్తుంది. ఇక హోండా బైక్స్ లలో షైన్ కి వున్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువ. సూపర్ స్టైలిష్ బైక్ గా మార్కెట్ లో దీని పికప్ మాములుగా ఉండదు.2006లో తొలిసారి లాంచ్ అయిన ఈ షైన్ మోడల్ గతేడాది ముగిసేనాటికి 90 లక్షల విక్రయాలను అందుకున్నట్లు హోండా సంస్థ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో అత్యుత్తమంగా విజయవంతమైంది. లాంచ్ అయిన రెండేళ్లలోనే అత్యధిక విక్రయాలు అందుకున్న 125సీసీ బైక్ గుర్తింపు తెచ్చుకుంది.


విడుదల అయిన మొదట 54 నెలల్లోనే 10 లక్షల వినియోగదారులు దీన్ని కొన్నారు.ఈ సరికొత్త షైన్ బీఎస్6 మోడల్ 124సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 7500 ఆర్పీఎం వద్ద 10.59 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 6000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. మైలేజి వచ్చేసి గరిష్ఠంగా లీటరుకు 55 కిలోమీటర్లు ఇస్తుంది. అంతేకాకుండా దీని బరువు వచ్చేసి 114 కేజీలు ఉంది.బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా లాంచ్ అయిన ఈ బండి ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో సొంతం చేసుకోవచ్చు. ఢిల్లీ ఎక్స్ షోరూం ధరల ప్రకారం బేసిక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.71,550/- వుంది.డిస్క్ బ్రేక్ కలిగి ఉన్న హైయర్ వేరియంట్ ధర మార్కెట్ లో 76,346/-వుంది.


ఇక హోండా కంపెనీ ఇప్పటికే తన వినియోగదారుల కోసం అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రాయితీలను కల్పించడం జరిగింది.ఇక  షైన్, గ్రేజియా 125 మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్ తో ఆకర్షణీయమైన ఆఫర్లు ఇచ్చింది.షైన్, గ్రేజియా టూవీలర్లపై వినియోగదారులకు 5 శాతం క్యాష్ బ్యాక్ ను ఇచ్చింది. కార్డుపై 3,500 దాకా డిస్కౌంట్ ఇచ్చింది. ఈ ఆఫర్ కేవలం ఈఎంఐ ద్వారా పే మెంట్ చేసేవారికి మాత్రమే అందుబాటులో ఉండేల అవకాశం కల్పించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు ఈ ఆఫర్ పొందాలంటే కనీసం 40 వేల రూపాయల పే మెంట్ చెయ్యాలి. ఈ రాయితీ మే 1 నుంచి జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: