భారతదేశ కళాత్మక వస్తువులను విదేశాల్లో విక్రయించడానికి సంబంధించి అతిపెద్ద బి2బి వేదిక అయిన కళారా(www.qalara.com) రిలయన్స్ అండతో ప్రపంచవ్యాప్తంగా కొత్త అంతర్జాతీయ మార్కెట్ల వరకు చేర్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. స్వదేశీ గొప్పదనాన్ని తెలిపే ఏటికొప్పాక నుంచి చెక్కబొమ్మలు, నర్సాపూర్ నుంచి క్రోచె ట్ లేస్ డ్రెస్ లు ఇప్పటికే కొత్త అంతర్జాతీయ మార్కెట్లను చేరుకున్నాయి. అలాగే ఇంటి అలంకరణ, హోమ్ టెక్స్ టైల్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్, బొమ్మలు, కిచెన్ మరియు డైనింగ్, బహుమతులు, అవుట్ డోర్, ఫర్నీచర్, ఇంకా మరెన్నో రకాలకు చెందిన 75,000కు పైగా కళాత్మక ఉత్పాదనలను దేశ నలుమూలల నుంచి కళారా ప్రపంచ వ్యాప్త కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇందులో బహుమతులు, హస్తకళల కు సంబంధించి అనేక వస్తు ప్రదర్శన ఆసియాకు చెందిన అతిపెద్ద వేడుక ఐజిహెచ్ఎఫ్ అక్టోబర్ 31 వరకు జరుగనుంది. ఇక్కడ కళారా తన బి2బి వేదికను ప్రదర్శించనుంది. ఇది ఎంతగానో భారతీయ కళాకారులకు, డీలర్లకు లబ్ధి చేకూర్చనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే కొనుగోలుదారులను చేరుకోవడం లో తోడ్పడ నుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్ ను పలు భారతీయ హస్తకళా ఉత్పాదనలు చేరుకోవడంలో కళారా తోడ్పడింది. లాస్ ఏంజెల్స్ కు చిన్నమలైకి చెందిన చేనేత కిచెట్ టవల్స్  చేరుకున్నాయి. హాంకాంగ్ కు ఒడిషా లోని మయూర్ భంజ్ తో పాటుగా పశ్చిమబెంగాల్ కు చెందిన సబాయి గ్రాస్ ప్లేస్ మెంట్స్ వెళ్లాయి. మణిపూర్ కు చెందిన లాంగ్ పి కుండలు కెనడా మార్కెట్లలో కూడా లభ్యమవుతాయి. సింగపూర్ లో చెన్నపట్న బొమ్మలు దొరుకుతాయి. మారిషస్ లో సహరాన్ పూర్ కు చెందిన చేతితో చెక్కిన చెక్క అలంకరణ వస్తువులు వెళ్లాయి. లండన్ దుకాణాలలో ఒడిషాకు చెందిన హ్యాండ్ పెయింటెడ్ పట్టాచిత్రలు లభిస్తాయి. యూకే లో ని దుకాణాలలో ఆగ్రాకు చెందిన చేతితో తయారు చేసిన బర్నర్లు ఉన్నాయి. జైపూర్ సాంప్రదాయక ఆభరణాలు యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏలతో సహా మరెన్నో దేశాలకు ఎగుమతి అయ్యాయి.

ఇలా 600కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా తయారీ సంస్థలు, హస్తకళాకారులు, తయారీదారులు, ఎగుమతిదారులు కళారా తో  నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే కళారా కూడా 50కిపైగా దేశాల నుంచి వేలాది మంది కొనుగోలుదారులను కలిగి ఉంది. దీనితో కేవలం ఏడాది కంటే తక్కువ సమయంలోనే బి2బి షిప్ మెంట్స్ 40కిపైగా దేశాలకు వెళ్లాయి. దీనితో ఆయా ప్రాంతాలలో వినియోగదారుల డిమాండ్, ఉత్పాదన, ప్రైసింగ్ ధోరణులను అర్థం చేసుకునేందుకు డేటా, సాంకేతికతల సమ్మేళనాన్ని కళారా ఉపయోగిస్తుంది. అంతేకాకుండా భారతీయ కళాత్మక వస్తువులకు మార్కెటింగ్, విక్రయ అవకాశాలను పెంచుకునేందుకు గాను ఆ సమాచారాన్ని తిరిగి కళాకారులకు అందిస్తుంది. కళారా ఆర్డర్ పై తయారు చేయడం, కస్టమైజేషన్, సరైన సమయంలో పంపడం లాంటి పలు ఫుల్ ఫిల్ మెంట్ మోడల్స్ ను అందిస్తుంది. అలాగే పలు రకాల అంతర్జాతీయ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: