వెంకటేష్ వరుణ్ తేజ్ లు నటించిన F2 సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మాస్ సినిమాలు చూసి చూసి విసుగొచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతో రిఫ్రెష్ ఇచ్చింది.. కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు  చేయడం ఒక్క అనిల్ రావిపూడి కే చెల్లింది..అయన సినిమాలు అన్నీ దాదాపు ఇదే ఫార్ములా ని పోలి ఉంటాయి.  ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు..