కేంద్రం పై మోడీ ఓ యుద్ధాన్ని ప్రకటించారని అయన చేస్తున్న కొన్ని చర్యల ద్వారా చెప్పొచ్చు. గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో బీజేపీ పార్టీ బలపడుతుండడంతో ఆ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు కేసీఆర్. ఇటీవలే జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ పార్టీ ఓ మోస్తరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ దెబ్బకు దాదాపు 40 సీట్లు గులాబీ పార్టీ కి తగ్గాయి.. ఇదిలా ఉంటే ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు విషయంలో మోడీపై పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆగ్రహం కాస్త నిరసన గా మారిపోయింది..