టాలీవుడ్ లో నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. తొలి సినిమా ని ఆయన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ముగ్డులయిపోయారు..లైన్ కాస్త పాతదే అయినా అందులోని కంటెంట్ కొట్టగా నింపి ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యాడు.. నాని లాంటి హీరో తో అంత సింపుల్ కథ ఏంటి అని అందరు అనుమానపడ్డా సినిమా ను హిట్ రేంజ్ కి తీసుకెళ్ళాడు అంటే త్వరలోనే పెద్ద డైరెక్టర్ అయ్యే సూచనలు ఉన్నాయని ప్రేక్షకులకి అర్థమయిపోయింది.