ఏపీ లో ఏ పార్టీ నుంచి ఏ పార్టీ కి వెళ్లినా పార్టీ మారిన రాజకీయ నాయకుడి రాజకీయ జీవితం అస్తవ్యస్తంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ను హీరో గా చూసుకుని వైసీపీ నుంచి టీడీపీ కి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు..ఈ ఎన్నికల్లో వారికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. దారుణ ఓటమి పాలయ్యారు.. అదంతా జగన్ శాపమే అనుకున్నారు ఆయా నేతలు.. లేకపోతే జగన్ ఎంతో కష్టపడి వారికి విజయం చేకూరిస్తే ఆయనను కాదని వేరే పార్టీ కి వెళ్లడం వారి నిజాయితీ నిదర్శనం గా నిలుస్తుంది.. ఆ పాయింట్ కారణంగానే ప్రజలు వారికీ రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారు.